వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.. నారా లోకేష్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 Nara Lokesh Comments On Ap Budget Details, Nara Lokesh , Ap Budget, Tdp, Jagan M-TeluguStop.com

జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ప్రజలు నిర్ధారణకు వచ్చారు.ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారు.

అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసాగించటమే.బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారు.

అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం.వాహన మిత్ర అబద్దం, డ్రైవర్ల ను మోసం చేశారన్నది నిజం.

సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోంది.హాజరు శాతం పేరుతో అమ్మఒడి లో భారీ కోత పెట్టారు.ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి 1850 పింఛన్ ఇస్తే, తండ్రి కొడుకులు కలిసి ఇచ్చింది కేవలం రూ.625 మాత్రమే.మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు.ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube