మహారాష్ట్రలో జరిగిన రోడ్డుప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా.
ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీకి తీవ్రగాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు.
అదేవిధంగా ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి.వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
సైరస్ మిస్త్రీ మృతిపై వ్యాపార, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.







