భారీ ధర పలికిన ”NBK108” డిజిటల్ రైట్స్.. ఏ సంస్థ సొంతం చేసుకుందంటే?

నందమూరి నటసింహం బాలయ్య( Balakrishna ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”NBK108”. ఈ సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 భారీ ధర పలికిన ”nbk108” డిజిటల-TeluguStop.com

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాల తర్వాత బాలయ్య బాగా బిజీ అయ్యాడు.ఈ సినిమాల ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా NBK108 కావడంతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా లేడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్ అనిల్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి వరుస అప్డేట్ లను వదులుతున్నారు.ఈ అప్డేట్ లతో ఈ సినిమా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇక ఈ మధ్యనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అందరిని సర్ప్రైజ్ చేసారు.

ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటిస్తూ.పోస్టర్ మీద ”విజయదశమికి ఆయుధ పూజ” అని ప్రకటించారు.

దీంతో దసరా కోసం ఫ్యాన్స్ ఎదురు చుస్తునాన్రు.ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా షూట్ పూర్తి చేసుకోకుండానే బిజినెస్ భారీగా జరుపు కుంటున్నట్టు తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్( Digital Streaming ) హక్కులపై ఒక బజ్ వినిపిస్తుంది.ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) వీడియో వారు డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు దక్కించు కున్నారట.

మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఈ సినిమా నుండి వినిపిస్తున్న ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Video : NBK108 Digital Streaming Rights Sold To Amazon Prime Video, Balakrishna, Anil Ravipudi, NBK108, Sreeleela, Amazon Prime Video #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube