అందంగా, ఆకర్షనీయంగా కనిపించేందుకు అందరూ ఎంచుకునే మార్గం మేకప్.ముఖ్యంగా అమ్మాయిలు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టరు.అంతగా మేకప్‌కు అలవాటు పడిపోయారు.అయితే ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.ఈ సీజన్‌లో మేకప్ వేసుకుని బయట తిరిగితే.ఎండల దెబ్బకు చెమటల రూపంలో మేకప్ మొత్తం ఇట్టే పోతుంది.
దాంతో ఏం చేయాలో తెలియక నానా తిప్పలు పడుతుంటారు.అయితే సమ్మర్‌లో కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.
ఎక్కువ సమయం పాటు మేకప్ ఉండేలా చేసుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
వేసవి కాలంలో మేకప్ పోకుండా ఎక్కువ సమయం ఉండాలీ అంటే.ముందుగా ఐస్ క్యూబ్ ను తీసుకుని కాటన్ క్లాత్‌లో వేసి ముఖానికి అద్దుకోవాలి.ఇలా ఐదు నిమిషాల పాటు చేసి.ఆ తర్వాత మేకప్ వేసుకుంది పోకుండా ఉంటుంది.
సమ్మర్ సీజన్‌లో ఖచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.ఆపై మేకప్ వేసుకోవడం మంచిది.

అలాగే సమ్మర్‌లో మామూలు ఫౌండేషన్‌నే వాడితే.కొంత సమయానికి జిగురుగా కారిపోతుంది.అందువల్ల, ఆయిల్‌ఫ్రీ, మినరల్ బేస్డ్ ఫౌండేషన్‌నే వాడాలి.మరియు ఫౌండేషన్‌కు ముందు తప్పకుండా ప్రైమర్ యూజ్ చేయాలి.వేసవిలో బ్లష్, ఐ షాడో వంటివి పౌడర్ ఫార్మ్ లో ఉన్నవి వాడితే మంచిది.లిక్విడ్ ఫార్ములాలో ఉండేవి వాడితే కొంత సమయానికి చెమట రూపంలో కారిపోతుంది.
అలాగే కాంపాక్ట్ పౌడర్ వేశాక చెమటలు పడితే.మళ్లీ కాంపాక్ట్ పౌడర్ పౌడర్ వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.కానీ, ఈ సమ్మర్‌లో ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకునే బ్లాటింగ్ షీట్స్ వాడితే.ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.
ఇక సమ్మర్‌లో మస్కారా, కాంపాక్ట్ పౌడర్, కాటుక, ఐ లైనర్, లిప్ స్టిక్, ఇలాంటి ప్రోడెక్ట్స్ వాటర్ ప్రూఫ్ లో ఉండేవి వాడితే.ఎక్కువ సమయం ఉంటాయి.
మరియు వేసవిలో ఎంత లైట్‌గా మేకప్ వేసుకుంటే అంత మంచిది.