మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట సినిమా రేపు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.గత వారం రోజులుగా సినిమా యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున సినిమా ను ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే.
మహేష్ బాబు వారం రోజులుగా విశ్రాంతి లేకుండా రేయింబవల్లు కూడా సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు.వెబ్ మీడియా.
సోషల్ మీడియా.ప్రింట్ మీడియా ఇలా అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
సర్కారు వారి పాట సినిమా ను సరి కొత్తగా ప్రమోషన్ చేసేందుకు థమన్ మరియు పరశురామ్ లు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సర్కారు వారి పాట యొక్క ప్రమోషన్ జరిగింది.
సినిమా మరి కొన్ని గంటలు ఉండగా చిత్ర దర్శకుడు పరశురామ్.సంగీత దర్శకుడు థమన్ మరియు పాటల రచయిత అనంత శ్రీరామ్ లు మాట్లాడేందుకు ట్విట్టర్ స్పేస్ కు వచ్చారు.
ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ప్రమోషన్ కోసం ట్విట్టర్ స్పేస్ ఏర్పాటు చేయలేదు.మొదటి సారి మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ స్పేస్ ను ఏర్పాటు చేయడంతో ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సర్కారు వారి పాట సినిమా ట్విట్టర్ స్పేస్ లో భారీ మొత్తంలో జనాలు పాల్గొన్నారు.ఇంతటి భారీ ట్విట్టర్ స్పేస్ ఒక తెలుగు సినిమాకు జరగడం ఇదే ప్రథమం అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పెద్ద ఎత్తున ట్విట్టర్ స్పేస్ కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సినిమా లో మహేష్ బాబు పాత్ర మరియు ఆయనతో చెప్పించిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి.
మహేష్ బాబు పాత్ర చాలా స్పెషల్‌గ ఆ ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.