టీడీపీనా బీజేపీనా ? పవన్ ఆప్షన్ ఏంటో..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన ధ్యేయం అని పదేపదే ప్రకటిస్తున్నారు.

 Pavan Kalyan Political Strategies For 2024 Elections, Pavan Kalyan , Janasena,-TeluguStop.com

సీఎం సీటు గురించి కూడా తాను పట్టించుకోనని, కానీ ఏపీలో వైసిపి మరోసారి అధికారంలోకి రాకూడదని పవన్ చెబుతున్నారు.అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా విపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళ్తే ఫలితం అనుకూలంగా ఉంటుందని,  సులువుగా వైసీపీని ఇంటికి పంపవచ్చని పవన్ అనేకసార్లు ప్రకటించారు .ఇక బిజెపితో జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అనే విషయంలోనూ చాలాకాలంగా అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.అయితే ఈ విషయంపై ఇటీవల మరింత క్లారిటీ వచ్చింది.

ఇటీవల ఎన్డీఏ మిత్రపక్షలతో ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) ప్రత్యేకంగా భేటీ అయ్యారు .

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Modhi, Pav

 ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది.ఇక తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని పవన్ సైతం ప్రకటించారు.కానీ టిడిపిని కూడా కలుపుకు వెళ్లే  విధంగా బిజెపి పెద్దలను ఒప్పించే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు .అయితే ఏపీలో బిజెపి వైసిపిని వ్యతిరేకిస్తున్నా,  అనేక విషయాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా,  రహస్యంగా మాత్రం ఆ పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ,  ఏపీ సీఎం జగన్( CM jagan ) విజ్ఞప్తి మేరకు ఏపీ కి సంబంధించిన నిధులు విడుదల,  పోలవరం ప్రాజెక్టు కు నిధులు ఇలా అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే స్పందించడం, అనేక సందర్భాల్లో జగన్ ను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపడం, తదితర పరిణామాలతో బీజేపీ రహస్యంగా వైసీపీతో పొత్తు కొనసాగిస్తుందనే అనుమానం పవన్ కు ఉంది.అలా అని బిజెపిని వీడి టిడిపితో కలిసి వెళ్లేందుకు పవన్ ఇష్టపడడం లేదు.

అలా అని టిడిపి లేకుండా బిజెపి,  జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు.

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Modhi, Pav

 ఏదో రకంగా బిజెపి పెద్దలను ఒప్పించి టిడిపి ,జనసేన , బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్( Pawan klayan ) ప్రయత్నిస్తున్న టిడిపి విషయంలో మాత్రం బిజెపి పెద్దలు అంత సానుకూలంగా లేరు  ఈ క్రమంలో పవన్ టిడిపి తో వెళ్లాలా ? లేక బిజెపితోనే పొత్తు కొనసాగించాలా అనే విషయంలో గందరగోళంలో ఉన్నారు.బిజెపి, జనసేన కలిసి పోటీ చేసినా, ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కవనే విషయం పవన్ కు బాగా తెలుసు.అందుకే టీడీపీ కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారు.

టిడిపి విషయంలో బిజెపి క్లారిటీ కి వచ్చేసిన నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఎవరితో కలిసి ఎన్నికల సమరానికి వెళ్తారు అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube