నటన అనేది వంశపారంపర్యంగా వస్తుంది అనేది ఒకప్పటి మాట.కానీ ఇప్పుడు నటిస్తున్న కుర్ర హీరోలు అందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ తక్కువగా ఉన్నవారే.
అయితే సినీ ఇండస్ట్రీలో తమ ఫ్యామిలీలో నటించే వాళ్ళు ఉంటే చాలు తాము కూడా సినిమాల్లో రాణించేయొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.అన్నయ్య ఏవో తిప్పలు పడి తన టాలెంట్ తో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని ఉంటే అన్నయ్య ని చూసుకుని, అసలు నటనలో ఓనమాలు కూడా నేర్చుకోని తమ్ముళ్లు కూడా అన్న పేరు చెప్పుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.
హీరో ఇమేజ్ లేకపోయినా ఎలాగోలా సినిమాల్లో నటించే తాము కూడా ఒక చక్రం తిప్పుదాము అనుకునే తమ్ముళ్లే కూడా మన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.అలా సినీ ఇండస్ట్రీలో ఎదిగిన అన్నలు… అన్నలని చూసుకుని ఎదగాలి అని అనుకుంటున్నా తమ్ముళ్లు ఎవరో చూద్దాం.!

అందులో మొదటగా చెప్పుకోవాలిసింది విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండని చూస్తే ఈ కాలం హీరోలు అందరు ఆదర్శంగా తీసుకోవాలి.తనకున్న స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఒక పక్క ప్రొడక్షన్ అని, మరో పక్కా సొంత బిజినెస్ అని ఎడాపెడా సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ.అలాగే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా హీరోగా చేసాడు.
కానీ అన్న పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో ఛాన్స్ కొట్టేసాడు గాని నటుడిగా మాత్రం అంతా క్లిక్ అవ్వలేదు.అతని పెర్ఫార్మన్స్ తేలిపోయింది.ఇలా రెండు మూడు సినిమాల్లో నటించాడు గాని అన్నకి తగ్గా గుర్తింపు తమ్ముడుకి రాలేదు.

ఇంకా ఇదే కోవలోకి వచ్చే వాళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ.అన్న హీరోగా అవ్వకముందే తండ్రి బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ లో మంచి ప్రొడ్యూసర్.తండ్రిని చూసుకుని పెద్ద కుమారుడు సినిమాల్లో నటిస్తున్నాడు.
మళ్ళీ ఇప్పుడు అన్నను చూసుకుని తమ్ముడు కూడా సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోతున్నాడు.మరి అన్న పరిస్థితే అటు ఇటుగా ఉంటే తమ్ముడు ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

అలాగే దగ్గుబాటి రాణా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంభంలో నుంచి వచ్చాడు.తనదైన నటనతో రాణా అందరిని మెప్పించాడు.మళ్ళీ ఇప్పుడు అన్న బాటలోనే రాణా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అభిరామ్ కి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా అనే విషయం పక్కన పెడితే ఆయనకు ఉన్న అవలక్షణాలు గురించి మాత్రం దేశం మొత్తం తెలుసు.

అలాగే అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ కూడా ఇదే కోవలోకి వస్తాడు.అల్లు అర్జున్ సంపాదించుకున్న స్టార్ ఇమేజ్ ను తమ్ముడు సంపాదించుకోలేకపోయాడు.

అలాగే మాస్ మహారాజ్ రవితేజ తమ్ముళ్లుగా అప్పుడెప్పుడో ఎంట్రీ ఇచ్చిన భరత్, రఘు సినిమాల్లో సక్సెస్ అవ్వలేక హఠాత్తుగా సినిమాలు మానేసి అడ్డదారి తొక్కి జైలుకి కూడా వెళ్లారు.అలాగే శ్రీకాంత్ తమ్ముడు కూడా అనిల్ సైతం హీరో అనే విషయం చాలా మందికి తెలియదు.ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తమ్ముడు పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.

అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు.ఉప్పెన సినిమాలో హీరోగా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.మరి అన్నలాగా మెప్పిస్తాడో లేక ఒక సినిమాతోనే సరిపెట్టుకుంటాడో అనేది చూడాలి.