టాలీవుడ్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ఒకే ఒక్క హీరోయిన్ పేరు వినపడుతుంది ఆమే ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి .ఆమె చేసిన మొదటి సినిమా హిట్ అవడం లక్కీ అయితే ఆ సినిమాతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి.
ఇక ఆ సినిమానే కాదు ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా అమ్మడు సూపర్ హిట్ కొట్టింది.ఇక లేటెస్ట్ గా అమ్మడి ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డది.
నాగార్జున, నాగ చైతన్యల కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
బంగార్రాజు హిట్ తో తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్ వేసుకుంది కృతి శెట్టి.
ఇక మూడు వరుస హిట్లు కొట్టేసరికి టాలీవుడ్ లో ఆమె లక్కీ హీరోయిన్ అయ్యింది.సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవ లేదు.
అందుకే కృతి శెట్టి ఉంటే సినిమా హిట్ అన్న టాక్ వచ్చేసింది.అందుకే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే అమ్మడు రాం ది వారియర్ లో.సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలో నటిస్తుంది.దీనితో పాటుగా నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాలో కూడా నటిస్తుంది.