మనం ఏదేని కొత్త పని చేయడం కోసం డబ్బులు కావాలని బ్యాంకు కు వెళ్లడం సహజం.రకరకాల కారణాలు చెబుతూ బ్యాంకు లోన్ల కోసం అర్జీ పెట్టుకుంటారు.
కొన్ని సందర్భాల్లో మన లోన్ యాక్సెప్ట్ అవుతుంది.మరికొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది.
అందుకోసమని మనం బ్యాంకును ఏమీ చేయం.బ్యాంకు అధికారులను కూడా ఏమీ అనలేం.
ఎందుకంటే ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా రూల్స్ ఉంటుంటాయి.వారి రూల్స్ వల్ల లోన్స్ రిజెక్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది.
కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు లోన్ ఇవ్వలేదని ఓ బ్యాంకునే తగలబెట్టేశాడు.ఈ ఘటనకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే.
బ్యాంకులో లోను ఇవ్వలేదని బ్యాంకునే తగులపెట్టాడు ఓ ప్రబుద్ధుడు.ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో నివాసముండే హసరత్సబ్ అనే వ్యక్తికి ఆ జిల్లాలో ఉన్న కెనరా బ్యాంకు లోనును రిజెక్ట్ చేసింది.
దీంతో అతడు ఆ బ్యాంకు మీద పగ పెంచుకున్నాడు.ఎలాగైనా సరే బ్యాంకును లేకుండా చేయాలని అనుకున్నాడు.
తను అనుకున్నదే తడవుగా ఓ రాత్రి బ్యాంకు వద్దకు వెళ్లిన హసరత్సబ్ ముల్లా బ్యాంకు అద్దాన్ని పగులగొట్టి పెట్రోల్ పోశాడు.ఇలా తను పెట్రోల్ పోసిన తర్వాత ఆ బ్యాంకుకు నిప్పంటించాడు.
ఇలా చేయడం వల్ల బ్యాంకులో ఉన్న సామాగ్రి, కుర్చీలు, ఫైల్స్ తదితరాలు ధ్వంసమయ్యాయి.ముల్లా చేసిన ఈ పని వలన బ్యాంకుకు దాదాపు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.స్థానికులు బ్యాంకు కాలిపోతుందని పోలీసులు, మరియు ఫైర్ అధికారులకు ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.