ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.
ఇందులో భాగంగా 1వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోట్ చేశారు. అయితే ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేర సందిగ్దత నెలకొంది.
దీంతో తాజాగా ప్రభుత్వ అధికారులు ఈ పదో తరగతి పరీక్షల విషయంలో స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.అయితే ఇందులో భాగంగా జూలై 10వ తారీకు నుంచి యధావిధిగా పరీక్షలు నిర్వహిస్తారని కాబట్టి విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు.
మరోపక్క కొంతమంది వ్యక్తులు సరైన అవగాహన లేకుండా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారని కాబట్టి వాటిని నమ్మొద్దని విద్యార్థులకు తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవలే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ప్రభావిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులను ఇంటర్మీడియట్ కి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
దీంతో కొంత మంది ప్రజా సంఘ నాయకులు మరియు కమ్యూనిస్టు వాదులు ఈ విషయంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని అలాంటిది పరీక్షలు జరపకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడం ద్వారా భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి కచ్చితంగా పదో తరగతో పరీక్షలు కొంత ఆలస్యంగా అయినా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
.