ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకృతి ని ఆస్వాదిస్తున్నారు.ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
నార్మల్ రొటీన్ చెకప్ లో భాగంగా కుటుంబం తో కలిసి చంద్రబాబు అమెరికా వెళ్లారు.అక్కడ మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్ లో వైద్య పరీక్షలు ముగించుకున్న తరువాత అక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు,ఎన్ ఆర్ ఐ లను కలిశారు.
ఈ సందర్భంగా పాప్ కార్న్ తింటూ ఎన్ ఆర్ ఐ లతో కలిసి వీధుల్లో చక్కర్లు కొట్టారు.

ప్రస్తుతం ఈ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటున్నారు మిగతా టీడీపీ నేతలు.చాలా రోజుల తరువాత చాలా రిలాక్స్డ్ గా బాబు గారు పాప్ కార్న్ తింటూ అమెరికా లో ప్రకృతి ని ఆస్వాదిస్తున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం తో టీడీపీ కి చెందిన పలువురు కీలక నేతలు కాషాయం కండువా కప్పుకోవడం ఇలా భిన్న పరిణామాలు చోటుచేసుకోవడం తో విసిగిపోయి ఉన్న అధినేత ఇలా అమెరికా లో సేద తీరుతున్నారు.

తమ అధినేతకు చాలా రోజుల తరువాత కుటుంబంతో గడిపే అవకాశం వచ్చిందంటూ తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు.కాగా జూలై 28న అమెరికాకు వెళ్లిన ఆయన త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తుంది.