నిబంధనలు పాటించని పబ్ లు, వదలని జీహెచ్ఎంసి అధికారులు

నిబంధనలు పాటించని పబ్ లపై జీహెచ్ఎం సి అధికారులు ఉక్కుపాదం మోపారు.

జూబ్లీహిల్స్,బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉన్న నిబంధనలు పాటించని పబ్ లపై కొరడా ఝళిపిస్తూ పది పబ్ లను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

కొన్నింటికి ట్రేడ్ లైసెన్సులు లేవు, మరికొన్నింటికి బిల్డింగ్ పర్మిషన్లు లేవు, కొన్ని అయితే పర్మిషన్లు ఒకచోట ఉంటే పబ్బులు మరోచోట కొనసాగుతున్న నేపథ్యంలో జీహెచ్ ఎం సి అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

మొత్తం 20 మంది జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీల్లో పాల్గొని కొన్ని పబ్ లను సీజ్ చేయగా,మరికొన్నిటికి మాత్రం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.జెన్, ఫెర్టీ కేఫ్, ది పెవీలియన్, జ్యూరీ, లావింటేజ్, జీరో 40 బ్రూవింగ్, కార్బేడియన్ నైట్ క్లబ్, బ్రాడ్ వే పబ్‌లను అధికారులు సీజ్ చేయగా,

నోటీసులు అందించిన పబ్ లు గనుక స్పందించకపోతే వాటిపై కూడా యాక్షన్ తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.దశల వారీగా సరైన నిబంధనలు పాటించని పబ్‌లను మూసివేస్తామని కూడా అధికారులు తెలిపారు.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు