అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల నుండి దేశవాళీ లీగ్ టోర్నీల వరకు జట్టును విజయ సారథిగా ముందుకు నడిపిస్తూ అత్యధిక ట్రోఫీలు అందించిన కెప్టెన్లు చాలా తక్కువ మందే ఉన్నారు.అందులో భారత కెప్టెన్లు అగ్రస్థానాలలో ఉండడం విశేషం.
అత్యుత్తమ ప్రతిభా పాటవాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న కెప్టెన్లు టీ 20 లాంటి లీగ్లలో ఆడక పోవడం, ఆడిన సుదీర్ఘకాలం కొనసాగకపోవడం లాంటి కారణాలవల్ల కొంతమంది కెప్టెన్లు ట్రోఫీలు అందించలేకపోయారు.
అత్యధిక ట్రోఫీలు జట్టుకు అందించిన కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) అగ్రస్థానంలో ఉన్నాడు.మహేంద్రసింగ్ ధోని 2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ సాధించి పెట్టాడు.2011లో వన్డే ప్రపంచ కప్ టోర్నీ సాధించాడు.2013లో ఛాంపియన్స్ ట్రోఫీ( Champions Trophy ) సాధించాడు.ఇక ఐపీఎల్ లో కూడా 2010, 2011 లో వరుసగా టైటిల్ సాధించాడు.2014లో ఛాంపియన్స్ లీగ్ లో జట్టును ముందుండి గెలిపించి రెండో ఛాంపియన్స్ ట్రోపీ సాధించాడు.2018లో ఐపిఎల్ ట్రోఫీ సాధించాడు.2021, 2023లో మళ్లీ ఐపిఎల్ టైటిల్లు సాధించాడు.

మొత్తానికి మహేంద్రసింగ్ ధోని ఏకంగా 10 టైటిల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో రోహిత్ శర్మ( Rohit Sharma ) 5 టైటిల్లు జట్టుకు అందించి రెండవ స్థానంలో ఉన్నాడు.బ్యాటర్ గా అద్భుత రికార్డులను సృష్టిస్తున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది.ఐపీఎల్ లో 2015, 2017, 2019,2020లలో టైటిల్ సాధించాడు.2013లో ఛాంపియన్స్ లీగ్ లోను జట్టును విజేతగా నిలిపాడు.

ఈ జాబితాలో రికీ పాంటింగ్( Ricky Pointing ) మూడవ స్థానంలో ఉన్నాడు.2003, 2007లలో వన్డే ప్రపంచ కప్ సాధించాడు.2006,2009 లో ఛాంపియన్ ట్రోఫీ సాధించాడు.ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో( Dwayne Bravo ) నాలుగో స్థానంలో ఉన్నాడు.కెప్టెన్ గా నాలుగు సీపీఎల్ ట్రోఫీలు జట్టుకు అందించాడు.2015-18 మధ్య వరుసగా మూడు సీపీఎల్ ట్రోఫీలు, 2021లో సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ కు టైటిల్ అందించాడు.ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 1975, 1979 లో విండీస్ జట్టుకు రెండు ప్రపంచ కప్ లను అందించాడు.