Rohini: పవిత్ర చేసిన పని వల్ల రోహిణికి హార్ట్ ఎటాక్.. వైరల్ వీడియో?

కొన్ని కొన్ని సార్లు అవతలి వ్యక్తి వల్ల ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.అంటే కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు బాగా అరిచే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లకు దెబ్బకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయం.

 Jabardasth Pavitra Lady Comedian Rohini Funny Video Viral-TeluguStop.com

అవతలి వ్యక్తి బాగా గట్టిగా అరిచినా, గట్టిగా మాట్లాడిన కూడా కొంతమంది సెన్సిటివ్ పీపుల్స్ వెంటనే భయపడిపోతుంటారు.కొన్ని కొన్ని సార్లు వాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే ఇటువంటిదే తాజాగా బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణికి( Rohini ) కూడా ఎదురయింది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి.ఈమె తన పరిచయాన్ని బుల్లితెరపై ఎప్పుడో పెంచుకుంది.రోహిణి మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది.ముఖ్యంగా కొంచెం ఇష్టం.

కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.

అలా అప్పటి నుంచి రోహిణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత పలు సీరియల్ లలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక మాటీవీలో శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో( Bigg Boss ) అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.

కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.బిగ్ బాస్ తర్వాత రోహిణి జబర్దస్త్ లో( Jabardasth ) బాగా బిజీగా మారింది.

లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్విస్తుంది.జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.యూట్యూబ్ లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.చేసే ప్రతి అనిని వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.

అప్పుడప్పుడు తను కిచెన్ లో చేసే ప్రయోగాలను యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటుంది.చాలా వరకు ఈమెకు వంటలు రాకున్నా కూడా వంటలు చేస్తున్నట్లు బాగా వీడియోస్ పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తోటి ఆర్టిస్టులను తన ఇంటికి ఆహ్వానించి ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తుంది.ఇక తాజాగా యూట్యూబ్ లో ఒక వీడియో షేర్ చేసుకుంది.

అయితే ఈసారి తన ఇంటికి జబర్దస్త్ పవిత్ర( Jabardasth Pavitra ) రాగా తనతో బాగా సందడి చేసినట్లు కనిపించింది.అయితే రోహిణి కిచెన్ లో ఫిల్టర్ కాఫీ తయారు చేయగా ఆ సమయంలో పవిత్ర చేసిన పనికి రోహిణికి హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయింది.అంటే పవిత్ర ఉండి ఉండి ఒకేసారి గట్టిగా అరవటం వల్ల రోహిణి దెబ్బకు దడుసుకుంది.అప్పటికే రోహిణి అలా అనకు భయమేస్తుంది అన్నా కూడా.

మరోసారి గట్టిగా అరిచింది.దీంతో రోహిణి కాస్త డల్ అయినట్లు కనిపించగా వెంటనే మంచినీళ్లు తాపించింది పవిత్ర.

అయితే పవిత్ర అరవడం వల్ల తనకు ఒకేసారి గుండెల్లో భయం వచ్చినట్లుగా.అంటే హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా అనిపిస్తుంది అని తెలిపింది.

దీంతో ఆ వీడియో చూసి చాలామంది నువ్వు ఇంత సెన్సిటివా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

https://youtu.be/j7gFf6U1_Yw
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube