ఏపీలో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది.? రానున్న ఎన్నికల్లో జనసేన కి వచ్చే సీట్లు ఎన్ని.? అసలు జనసేన ప్రభావం సీనియర్ పార్టీలపై ఉంటుందా.? అసలు జనసేన కి ఎంతవరకూ సత్తా ఉంది ఈ విషయాలపై తాజా ఘటనకి సంభందించి విశ్లేషకులు కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించారు…మరి విశ్లేషకులు ఏమి చెప్పారు.జనసేన ఉంటుందా ఊదిపోతుందా.? అసలు 2019 ఎన్నికలవరకూ అక్కర్లేదు ఈలోగానే జనసేన సత్తా తేలిపోతుంది అంటున్నారు విశ్లేషకులు.వివరాలలోకి వెళ్తే.
రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల పోరులో తామేంటో నిరూపించుకుటాము అని తెలిపింది.అందుకు గాను జనసేన పార్టీ కార్యకర్త సిద్దంగా ఉండాలని.ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే జనసేన సత్తా చూపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన జనసేన నేత బొమ్మదేవర పద్మనాభ శ్రీధర్ తెలిపారు

పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తేనే కోట్లాది రూపాయలు వస్తాయని అయినా అవన్నీ వదులుకుని రాజకీయ ప్రవేశం చేస్తోంది కేవలం ప్రజా సేవకోసమేనని అన్నారు.పార్టీ ఎవరికీ సీట్లు ఇస్తుంది అనేది పూర్తిగా పార్టీ అభిప్రాయం అని అయితే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం త్వరలో రాష్ట్రంలో పర్యటనలు ఉంటాయని అన్నారు.ఈ పర్యటనల అనతంరం మండల, గ్రామ కమిటీల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు…జనసేన సభ్యుత్వం తీసుకున్నవారిలో 60 శాతం యువత ఉందని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం డిసైడ్ అయ్యినట్టు ప్రకటించిన విధానం ప్రకారం విశ్లేషకులు తమ అంచనాలని వెలిబుచ్చారు.
అసలు గ్రామస్థాయిలో వైసీపికి ఉన్న బలం కూడా లేని జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనీ అనుకోవడం సాహసమే అయినా ఒక వేళ పోటీ చేసినా సరే గెలుపు వరకూ కూడా వెళ్ళడం కష్టమేనని తెలిపారు.ఎందుకంటే గడిచిన ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన పరిస్థితి లేదు పార్టీని బలపరిచిన ధాకలాలు లేవు అంతేకాదు ఇప్పటి వరకూ నియోజకవర్గ ఇంచార్జులు కూడా లేని జనసేన ఈ ప్రకటన వింటే నవ్వు వస్తోంది అంటున్నారు.
రెండు రోజులు ఏపీలో దీక్ష చేపడితే 20 రోజులు హైదరాబాదు లో ఉండే పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు.ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ జనసేనకు నిర్మాణమే లేదు.
అలాంటిది బూత్ కమిటీలు… గ్రామ కమిటీలు వంటి నిర్మాణం కూడా లేకుండా స్థానిక సంస్థలకి వెళ్ళిపోతాం అని చెప్పడం జనసేన దూకుడు నిర్ణయాలకి నిదర్సనం అని అంటున్నారు.అంతేకాదు ఒక వేళ స్థానిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ప్రజలు జనసేనకి ఓట్లు వేయడం అనవసరం అనే ఆలోచనలోకి వెళ్తారని అంటున్నారు విశ్లేషకులు
.