సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలన్నా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలన్నా వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం ముఖ్యమనే సంగతి తెలిసిందే.కొంతమంది హీరోలకు ఎంత కష్టపడినా సక్సెస్ సొంతం కాకపోతే మరి కొందరు హీరోలకు మాత్రం అదృష్టం కలిసొచ్చి సులువుగానే సక్సెస్ దక్కుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు వరుస విజయాలు సొంతమవుతున్నాయి.
సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాల విజయాలతో మహేష్ బాబు మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది.త్రివిక్రమ్ , రాజమౌళి సినిమాలతో మహేష్ బాబు నటుడిగా మరో మెట్టు పైకి ఎదగడంతో పాటు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కొంతమంది చెబుతున్నారు.

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో నటుడిగా చిరంజీవి ఇతర హీరోలకు షాకిస్తున్నారు.వాల్తేరు వీరయ్య ఏకంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుండటం గమనార్హం. భోళా శంకర్ తో చిరంజీవి హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ తో హ్యాట్రిక్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

టెంపర్ నుంచి తారక్ కు వరుస విజయాలు సొంతమయ్యాయి.ఈ స్టార్ హీరో ఆర్.ఆర్.ఆర్ వరకు రికార్డులు క్రియేట్ చేసే రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విజయాలతో పవన్ కళ్యాణ్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ విజయాలతో అల్లు అర్జున్ కూడా వరుస విజయాలతో కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.మరి కొందరు హీరోలకు కూడా విజయాలు దక్కుతున్నా వరుసగా సక్సెస్ లు మాత్రం దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.