నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతి కోత్తేమీ కాదు.
మేమేమి సత్యవంతులమని చెప్పలేదు.కొన్ని దగ్గర్ల గ్రావెల్ ఎత్తిన మాట నిజమే అని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు.
జగనన్న లేఔట్లకు.పేదల ఇళ్లకు.రోడ్ల నిర్మాణానికి.చిన్నచిన్న గుంటల్లో ఒక 100 టిప్పర్లు తీసుకుంటే తప్పేంటి అని సూటి ప్రశ్న వేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
ఇప్పటికన్నా గత తెలుగుదేశం హయాంలో అవినీతి ఎక్కువగా జరిగిందని ఆరోపణ.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గత ప్రభుత్వంలో 400 కోట్ల వరకు గ్రావిల్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు.
మున్సిపాలిటీ అధికారులు పై అక్కడక్కడ విమర్శలో వస్తున్నాయని ఎక్కడన్నా ఇళ్ల నిర్మాణాల ప్లాన్ లకు మామూలు డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.కావలి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు.
నియోజకవర్గ పరిధిలోని అక్రమ గ్రావెల్ పై విచారణకు కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక ను నియమించడం జరిగింది.అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాసిల్దార్లను కూడా హెచ్చరించడం జరిగింది.