సైబర్ హ్యకింగ్ కు గురైతే వెంటనే ఆన్ లైన్ లో ఇలా ఫిర్యాదు చేసేయండి..!

ప్రస్తుతం చాలామంది ప్రతి విషయానికి ఆన్లైన్ పై ఆధారపడుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు( Cyber Crimes ) పెరిగిపోతున్నాయి.

అమాయక వ్యక్తులను ఎన్ని విధాలుగా మోసం చేసే అవకాశం ఉంటుందో అన్ని విధాలుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు 24 గంటలు దారులను తెరిచే ఉంచారు.

ఈ మధ్యన వర్క్ ఫ్రం హోం, యూట్యూబ్ వీడియోలు, కొరియర్ సర్వీసులు, పార్ట్ టైం ఉద్యోగాలు, బహుమతులు లాంటి వాటితో ఎంతో మంది అమాయకులను బురిడీ కొట్టించి దొరికిన కాడికి దోచేశారు.సైబర్ మోసానికి గురైన చాలామందికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక కాస్త ఆలస్యం చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే సైబర్ మోసానికి గురైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయాలి.ఒకవేళ ఆలస్యం అవుతుందంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే కొద్దో గొప్పో కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.మనం ఇప్పుడు ఆన్లైన్లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.

భారత కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్( Cybercrime Portal ) అనే వెబ్సైట్ ను సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడం ఏర్పాటు చేసి, 24 గంటల సర్వీస్ అందిస్తోంది.ఒకవేళ 1930 హెల్ప్ లైన్ కి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

ఘటన జరిగిన 24 గంటల లోపు ఫిర్యాదు చేస్తే జరిగిన ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.ముందు వెబ్సైట్ బ్రౌజర్ ఓపెన్ చేసి https://cybercrime.gov.in లో లాగిన్ అవ్వాలి.

అక్కడ హోమ్ పేజీలో file a complaint ఆప్షన్ పై క్లిక్ చేయాలి.వెంటనే ఒక పేజీ ఓపెన్ అయ్యి అక్కడ కొన్ని షరతులు చూపిస్తుంది.

ఇది చదివి యాక్సెప్ట్ చేసిన తర్వాత Report other cybercrime అనే బటన్ పై క్లిక్ చేయాలి.

తర్వాత citizen login అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన వివరాలు అంటే మీ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది.ఈ ఓటీపీని ఎంటర్ చేశాక అక్కడున్న క్యాప్చా ను బాక్స్ లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పుడు అసలైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ కనిపించే ఫారంలో మీకు జరిగిన సైబర్ మోసం గురించి పేర్కొనాలి.

Advertisement

అక్కడ నాలుగు సెక్షన్లు ఉంటాయి సాధారణ సమాచారం, బాధితుల సమాచారం, సైబర్ నేరానికి సంబంధించిన సమాచారం, ప్రివ్యూ సెక్షన్లు ఉంటాయి.ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను పొందుపరిచి చివరి సెక్షన్ ప్రివ్యూ సెక్షన్( Preview Section ) లో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి.

అన్ని సరిగా ఉంటే వెంటనే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.చివరకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

కంప్లైంట్ ఐడి తో పాటు ఇతర వివరాలతో ఒక ఈమెయిల్ వస్తుంది.అనంతరం అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు.

తాజా వార్తలు