శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?

తమిళ్ డైరెక్టర్ శంకర్ గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు డైరెక్టర్ శంకర్( Director Shankar ) పేరు వింటే చాలు అభిమానులు ప్రేక్షకులు అందరూ ఆయన సినిమాలపై బోలెడన్ని ఆశలతో కళ్ళు మూసుకొని మరి సినిమా థియేటర్లకు వెళ్లిపోయేవారు.

 Now Producers Control Budget On Shankar Movies Details, Shankar, Director Shanka-TeluguStop.com

ఇక హీరోలు అయితే కథ వినకుండా అనే సినిమాలకు ఓకే చెప్పేసేవారు.నిర్మాతలు సైతం శంకర్ సినిమా అంటే చాలు సై అనేవారు.

కానీ రోజులు మొత్తం మారిపోయాయి.గత దశాబ్ద కాలం అంతా మారిపోయింది.

ఇదివరకు ఆయన సినిమాలలో ఖర్చుకు తగ్గ అనుభూతి మనకు తెరపై కనిపించేది.కానీ ఈ ప్రస్తుతం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

తాజాగా విడుదలైన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పాలి.ఈ సినిమాలో కేవ‌లం పాటల కోసం 75 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు ఘ‌నంగా చెప్పుకుంది చిత్ర బృందం.

Telugu Shankar, Game Changer, Indian, Producers, Ram Charan, Shankar Budget-Movi

తీరా సినిమా చూస్తే ఆ ఖ‌ర్చంతా వేస్ట్ అనిపించింది.పాట‌ల కోసం పెట్టిన డ‌బ్బుతో ఒక మంచి సినిమా తీసి ఉండొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.గేమ్ చేంజ‌ర్ అనే కాదు,ఇండియ‌న్-2,( Indian 2 ) ( I Movie ) లాంటి సినిమాల్లో భారీత‌నం పేరుతో అన‌వ‌స‌ర హ‌డావుడి త‌ప్ప స‌రైన‌ కంటెంట్ క‌నిపించ‌లేదు.ఇదివరకు శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి అన్న కారణంతో నిర్మాతలు ఆయన చెప్పిందల్లా చేస్తూ వస్తున్నారు.

కానీ సినిమా ఫలితాల విషయానికి వచ్చేసరికి పరిస్థితులు మొత్తం తారుమారు అవుతున్నాయి.అందుకే ఇకమీదట పరిస్థితులు అలా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.ఇక‌పై శంక‌ర్‌ను న‌మ్మి ఇలా మితిమీరిన బ‌డ్జెట్లు పెట్టే నిర్మాత‌లు దొర‌క్క‌పోవ‌చ్చు.ఇండియ‌న్ 2, గేమ్ చేంజ‌ర్ సినిమాలు శంక‌ర్ పేరును బాగా దెబ్బ తీశాయి.

ఇక ఆయ‌న బ‌డ్జెట్ల మీద మోజును త‌గ్గించి కంటెంట్ మీద దృష్టిపెట్టాల్సిన స‌మయం వ‌చ్చింది.

Telugu Shankar, Game Changer, Indian, Producers, Ram Charan, Shankar Budget-Movi

ఒక‌వేళ పెద్ద బ‌డ్జెట్లో సినిమా తీసినా అందులో ఖ‌ర్చు పెట్టించే ప్ర‌తి రూపాయికీ త‌గ్గ ఔట్ పుట్ చూపించాల్సిన స్థితిలో ఉన్నాడు.ఊరికే భారీత‌నం పేరుతో అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు పెడితే అది నిర్మాత‌ల నెత్తిన గుదిబండ అవుతుందే త‌ప్ప‌, విష‌యం లేని భారీత‌నాన్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా లేరు.దీంతో ఆయన దర్శకత్వం పై ఆయన చేసే ఖర్చుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితేనే బెటర్, ఆ రేంజ్ లో ఎవరు ఖర్చు చేయరు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ప్రస్తుతం శంకర్ ఉన్న పరిస్థితులలో నెక్స్ట్ సినిమా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెప్పించే విధంగా ఉండాలి.

కతలో కూడా ప్రాధాన్యం ఉండాలి.లేదంటే ఇకమీదట ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం కష్టమనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube