టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ జోడీలలో శివబాలాజీ( Siva Balaji ), మధుమిత జోడీ ఒకటి కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివబాలాజీ, మధుమిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.శివబాలాజీ ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఈ అమ్మాయిని ఎలా పడెయ్యాలి అనే విధంగా ప్రయత్నించారని ఆమె అన్నారు.
ఒక తమిళ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుందని ఆ సినిమాలో నా ఆపోజిట్ రోల్ లో శివబాలాజీ నటిస్తున్నారని తెలిసిందని మధుమిత తెలిపారు.
మొదట శివబాలాజీ కొంచెం ఫోజు కొట్టాడని నేను చాలా రిజర్వ్డ్ గా ఉండేదానినని ఆమె కామెంట్లు చేశారు.
ఆ తర్వాత నేను కొంచెం పట్టించుకోకుండా ఉన్నానని మధుమిత చెప్పుకొచ్చారు.నేను, శివబాలాజీ తప్ప మిగతా వాళ్లంతా తమిళ వాళ్లు అని ఆమె కామెంట్లు చేశారు.హోటల్ రూమ్ నాకు నచ్చకపోవడంతో తన రూమ్ ఇచ్చారని మధుమిత( Madhumita ) పేర్కొన్నారు.నాకు ఫోన్ అవసరమైతే తన ఫోన్ ఎక్స్ట్రా ఫోన్ అని ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

శివబాలాజీ ఒక సందర్భంలో పెళ్లి చేసుకుందామా అని అని అడిగానని నాలుగేళ్లు ప్రేమలో ఉన్నామని అయితే అందులో 18 నెలలు బ్రేకప్ ఉందని మధుమిత తెలిపారు.మా అత్తయ్య వాళ్లు జాతకాలు చూపిస్తే సెట్ కాలేదని పెళ్లి చేసుకుంటే శివబాలాజీ తల్లి చనిపోతారని చెప్పారని మధుమిత పేర్కొన్నారు.ఆ సమయంలో శివబాలాజీ బ్రేకప్ చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.

మనం స్నేహితులుగా కొనసాగుదామని శివబాలాజీ చెప్పగా నేను నో చెప్పానని మధుమిత అన్నారు.ఏడాదిన్నర తర్వాత మళ్లీ కలిసిపోయామని మధుమిత తెలిపారు.మనస్సులో ప్రేమ ఉంటే జాతకాలు కూడా మార్చవచ్చని భావించామని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మళ్లీ అవే జాతకాలను చూపిస్తే గ్రహాల్లో మార్పుల వల్ల కుదిరిందని శివబాలాజీ అన్నారు.బ్రేకప్ సమయంలో చాలా బాధ పడ్డానని శివబాలాజీ వెల్లడించారు.శివబాలాజీ, మధుమిత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.