టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కృష్ణ హఠాన్మరణం గురించి తెలిసి ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.స్టార్ హీరో మహేష్ బాబుకే ఎందుకు ఈ విధంగా జరుగుతోందంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు కష్టాలను తట్టుకొని ముందుకు సాగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
శోభన్ బాబు గారు కృష్ణగారి కంటే సీనియర్ అయినప్పటికీ కృష్ణగారు మాస్ ప్రేక్షకులకు సులువుగా దగ్గరయ్యారని ఆయన తెలిపారు.శోభన్ బాబులా కృష్ణ ఒకే జానర్ సినిమాలకు పరిమితం కాలేదని భరద్వాజ్ కామెంట్లు చేశారు.
గూఢఛారి 116 సినిమాతో యాక్షన్ సినిమాలు చేస్తే కెరీర్ కు మంచిదని కృష్ణ భావించారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.శోభన్ బాబుతో మల్టీస్టారర్ చేసే సమయంలో కృష్ణకు సమస్య ఎదురైందని ఆయన వెల్లడించారు.
కృష్ణతో కలిసి నటించిన ఒక సినిమాలో శోభన్ బాబు ప్రాధాన్యతకు తగ్గడంతో శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

శోభన్ బాబు గారు కలర్ లో తీస్తేనే ఛాన్స్ ఇస్తానని నిర్మాతలకు చెప్పేవారని భరద్వాజ్ అన్నారు.కృష్ణగారు మాత్రం మల్టీస్టారర్స్ కు ప్రాధాన్యత ఇచ్చారని భరద్వాజ్ తెలిపారు.కృష్ణగారు గౌరవప్రదమైన పాత్రలకు ఓకే చెప్పుకుంటూ వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

శోభన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యడానికి ఇష్టపడలేదని భరద్వాజ్ అన్నారు.కృష్ణ మాత్రం చివరి వరకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించేవారని భరద్వాజ్ తెలిపారు.కృష్ణ సినిమా విడుదలైతే వారం రోజుల్లో లాభాలు వచ్చేవని శోభన్ బాబు మార్కెట్ మాత్రం కొంత తక్కువగా ఉండేదని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







