ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.నిన్న బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.బీజేపీకి పిటిషన్ వేసే అర్హత ఉందా.? లేదా.? అన్న దానిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరు పక్షాల న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు.ఈ నేపథ్యంలో ధర్మాసనం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







