హిందూమతంలో శక్తి ఆరాధనకు గొప్ప పండుగ అంటే దసరా నవరాత్రులు( Dasara Navratri ).అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడంతోపాటు ఈ నవరాత్రులలో చాలా ముఖ్యమైనదిగా భావించేది ఆయుధపూజ.
అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన దసరా జరుపుకోనున్నారు.ఇక హిందూ విశ్వాసం ప్రకారం ఈ పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్లపక్ష 9వ రోజున జరుపుకుంటారు.
అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 22న రాత్రి 7:58 గంటలకు ప్రారంభమై 23వ తేదీ సాయంత్రం 5:44 వరకు కొనసాగుతుంది.ఈ సంవత్సరం ఆయుధపూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడే సమూహూర్తం అక్టోబర్ 23వ తేదీన 1:55 నిమిషాల నుండి 2:43 నిమిషాల వరకు ఉంటుంది.

అయితే హిందూ మతంలో ఆయుధపూజ( Ayudhapuja )కు ఒక ప్రాముఖ్యత ఉంది.అలాగే దీని పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ విశ్వాసం ప్రకారం ఆయుధాల పూజ మహిషాసురమర్దిని కథతో ముడిపడి ఉంది.మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతం వధించడానికి దేవతలందరూ ఓ శక్తి రూపమైన దుర్గాదేవిని తమ ఆయుధాలను ఇస్తారు.
దీంతో ఆయుధాలను సంహరించే సమయంలో దుర్గాదేవి పూజించగా రాక్షసవదానంతరం దుర్గాదేవి విజయాన్ని సాధిస్తారు.అప్పుడే ఈ విజయాన్ని సంతోషంగా విజయదశమి( Vijayadashami )గా జరుపుకుంటారు.అయితే అప్పటినుంచి ఆయుధ పూజ జరుగుతుంది.

ఇప్పుడు ఆయుధ పూజా ఎలా చేయాలో తెలుసుకుందాం.నవరాత్రుల్లో ఆయుధాలను పూజించడానికి ముందుగా ఉదయాన్నే స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత శరీరం, మనసుని నిర్మలంగా ఉంచుకొని మొదటగా దుర్గాదేవిని ( Goddess Durga )అన్ని నియమాలతో పూజించాలి.ఆ తర్వాత మీ ఆయుధాలను జాగ్రత్తగా శుభ్రం చేసి గంగాజలంలో వాటిని శుద్ధి చేయాలి.
ఆ తర్వాత ఆయుధానికి పసుపు పూసి, గంధం, తిలకం మొదలైన వాటితో బొట్టు పెట్టి పూజించాలి.అనంతరం ఆయుధాలకు పువ్వులు సమర్పించి ఆనందం, అదృష్టం కోసం ప్రార్థించాలి.