కోవిడ్-19.ఇది రావడానికి ముఖ్యమైన కారణం విటమిన్ల లోపం.
విటమిన్ సి, డీ, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.ఇంకా ఈ విటమిన్లు మాత్రల రూపంలో కాకుండా పండ్లు, కూరగాయలును తీసుకోవడం మంచిది అని సూచించారు.
మరి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
మిరియాలు, శొంఠి, పిప్పళ్లు కలిపిన త్రికటు చూర్ణం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తదితర ద్రవ్యాలు ఏవైనా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడతాయి.
గుండె పని తీరు బాగుండాలంటే.ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను కలిపి తీసుకుంటే ఎంతో మంచి చేస్తుంది.
విటమిన్ ఎ.చిలగడదుంప, క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది.
విటమిన్ డి.పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, కాలేయంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.ఉదయం వేళ సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకుంటే మంచిది.
విటమిన్ ఇ.
పసుపు, సెనగలు, కరివేపాకు, ఎండుకొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందిస్తుంది.
విటమిన్ సి.ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామకాయ, పచ్చిమామిడి, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతోపాటు బొప్పాయి, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌లో కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ బి12.చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఎండుద్రాక్షల్లో విటమిన్ 12 ఎక్కువగా ఉంటుంది.ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
చూసారుగా.
ఈ ఆహారం తీసుకుంటే విటమిన్ల లోపం తగ్గి కరోనా వ్యాపించకుండా ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు.