ఒక పక్క కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూనే మరో పక్క కాళీ సమయంలో కోళ్ల పెంపకం చేపట్టాడు యల్.జయచంద్రనాయుడు.
ఈయన గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్.అయితే కాళీ సమయంలో ఎమన్నా ప్రవృతి చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు ప్రతాప్‌తో కలిసి తమిళనాడు నుంచి పర్లా జాతి రకం కోళ్లను తెచ్చి పోషిస్తున్నాడు.
ఆ కోళ్ల కోసం తన సొంత ఊరిలో ఒక షెడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు.అలాగే కోళ్లను గుంపులుగా కాకుండా ఒక్కో కోడికి ఒక్కో గూటిని నిర్మించారు.
ప్రస్తుతం 30 దాకా కోళ్లను పెంచుతున్నారు.వాటికి ఉదయాన్నే వ్యాయామం కూడా చేయిస్తారు.నీటి తొట్టెలో ఈత కొట్టిస్తారు.మిశ్రమ దాణాతోపాటు బాదంపిస్తా, పప్పు, సజ్జలు, జొన్నలు, రాగుల ఆహారాన్ని అందిస్తున్నారు.
సరైన పోషకాహారం వలన కోళ్ల శరీరాకృతిలో దృడత్వంతో పాటు చక్కటి ఆహర్యం కూడా వస్తుందని జయచంద్రనాయుడు తెలిపారు.అలాగే ఆయన ఆ కోళ్లకు దాణా కోసం నెలకు సుమారు రూ.10వేల వరకు ఖర్చు పెడుతున్నారు.కోడి అందం, బరువును బట్టి ధర పలుకుతుందని ఆయన వివరించారు.
ఈ కోళ్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి.అందమైన చిలుకలాంటి ముక్కు, పొడవైన తోక ఉండటం పర్లాజాతి కోళ్ల ప్రత్యేకత.మాంసం, పందేల కోసం కాకుండా అందాల పోటీలకు సైతం వీటిని వినియోగిస్తారు.ఈ కోళ్లు పలు రకాల రంగుల్లో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
చిన్నప్పటి నుంచి పక్షులంటే ఉన్న ఇష్టంతో పర్లా జాతి కోళ్లు గురించి తెలుసుకుని వాటిని పెంచుతున్నా అని తెలిపాడు.అంతేకాకుండా కోళ్ల పెంపకందారులతో వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారట.
ఆ గ్రూప్ లో కోళ్ల ఫొటోలు ఉంచుతాం.నచ్చినవారు ఫోన్ చేసి ఆ కోళ్లను విక్రయిస్తారట.
ఒక్కో పుంజు కోడి ధర రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఉంటుందని జయచంద్రనాయుడు తెలిపారు.