పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని మార్చి 11వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.
ఇదిలావుండగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ కథాంశం ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ చిత్రం గురించి మనకు తెలిసిందే ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల గురించి పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ సినిమా దీపావళికి విడుదల కాబోతుందని వార్తలు రావడంతో ఈ విషయంపై నిర్మాతలు స్పందిస్తూ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.శివరాత్రి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ప్రభాస్ నటించినఆది పురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రామాయణం నేపథ్యంలో దాదాపు 20 భాషలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా కృతిసనన్ సీత పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు.ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.