అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నిక విషయంలో విదేశీ శక్తుల సాయం తీసుకున్నాడనే విషయం ఆధారాలతో సహా తమ వద్దున్నాయని డెమొక్రాట్లు గత కొంత కాలంగా ట్రంప్ పై అభిశంసన పెట్టి విచారణ చేయాలని పట్టు బడుతున్న విషయం విధితమే.అయితే ఈ విషయంపై ఇంకా డెమోక్రాట్లు పట్టిన పట్టు విడువడం లేదు తాజాగా అమెరికాలోని ప్రతిపక్షం ఈ తీర్మానాన్ని దిగువ సభలో ప్రవేశపెట్టింది.
అభిశంసనకి చెందిన అధికారిక ప్రక్రియని మొదలు పెట్టడానికి నిర్దేశించే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.దాంతో ఈ మేరకు ప్రతిపక్షానికే మెజారిటీ ఉన్న దిగువ సభలో ఈ తీర్మానం చర్చకి వచ్చే అవకాశం ఉందని, ఓటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది.
జో బిడెన్ విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరుకి నిరసనగా ఈ అభిశంసన మొదలయ్యిందనే విషయం విధితమే.ఈ ఆరోపణల నేపధ్యంలోనే ట్రంప్ పై అభిశంసనకి దారి తీసింది.

అభిశంసనకి సంభందించిన వివరాలని, కీలకమైన సాక్ష్యాలని ఇప్పటికే సేకరించిన డెమోక్రటిక్ పార్టీ ఈ ఆధారాలన్నీ త్వరలో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.అభిశంసనకి చెందిన సాక్ష్యాలని, అమెరికా ప్రజలు త్వరలో బహిరంగంగా వింటారని తెలిపింది.అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్షమపై కుట్రలు చేసిన ట్రంప్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా పౌరులు క్షమించరని తెలిపింది డెమోక్రటిక్ పార్టీ.
.