లింక్ క్లిక్ చేశాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.తాజాగా ఓ లింక్ రూపంలో వచ్చిన మెసేజ్ ఓ వ్యక్తికి చేదు అనుభవం మిగిల్చింది.

 Person Loses Rs 70 Thousand For Clicking The Link-TeluguStop.com

లింక్ ఓపెన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ రావడంతో అతడు ఆ లింకు ఓపెన్ చేశాడు.ఫలితంగా రూ.70 వేలు పోగొట్టుకున్నాడు.మంగళగిరిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

పెద్దవడ్లపూడికి చెందిన అర్జునరావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.

తనకు ఓ పార్సిల్ వచ్చిందని.దానికి సంబంధించి ఓ మెసేజ్ పంపిస్తామని, అందులో ఉన్న లింకును క్లిక్ చేసి రూ.11 చెల్లించాల్సిందిగా తెలిపారు.దీంతో అర్జునరావు తన ఖాతా నుంచి రూ.11 ఫోన్‌లో వ్యక్తి చెప్పినట్లుగా పంపాడు.కాగా తరువాత వచ్చిన మెసేజ్ అతడికి షాకిచ్చింది.తన అకౌంట్ నుండి రూ.70 వేలు వేరు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది.దీంతో తనకు ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేశాడు.

కానీ అప్పటికే మనోడికి పంగనామం పెట్టిన మోసగాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

చేసేదేమీ లేక మోసపోయినట్లు గ్రహించిన అర్జునరావు, మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన తీరుపై విచారణ చేపట్టారు.అందుకే ఆన్‌లైన్‌ మోసాల నుండి అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube