చిరంజీవి కోసం కథలు సిద్ధం చేస్తున్న హిట్ దర్శకులు

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి ఉన్నాడు.ఆచార్య సినిమా తర్వాత రెండు రీమేక్ లు చేస్తున్నాడు.

 Two Talented Director Write Stories For Chiranjeevi, Venky Kudumula, Anil Ravipu-TeluguStop.com

మోహన్ కృష్ణ దర్శకత్వంలో లూసీఫర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లు ఇప్పటికే ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి.ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే సారి స్టార్ట్ చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

వీటి తర్వాత కొత్త కథతో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక వీటి తర్వాత కూడా చిరంజీవి యంగ్ టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు.

Telugu Anil Ravipudi, Bobby, Chiranjeevi, Koratala Siva, Mehar Ramesh, Mohan Raj

అయితే సీనియర్ స్టార్ హీరోలు అందరూ జోనర్ మార్చి కొత్తదనం ఉన్న కథలు ట్రై చేస్తూ విభిన్నంగా వెళ్తూ ఉంటే చిరంజీవి మాత్రం ఇంకా సేఫ్ జోన్ లో కమర్షియల్ జోనర్ సినిమాలే చేస్తూ ఉండటంపై కొంత మంది విమర్శలు చేస్తున్న అభిమానులు తన నుంచి ఎలాంటి కథలైతే ఆశిస్తారో అలాంటి సినిమాలే చేయాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.కమర్షియల్ ఫార్మాట్ అయిన కంటెంట్ లో మాత్రం డిఫరెన్స్ చూపిస్తే ఆడియన్స్ తనని మెల్లగా కొత్త కథలలో చూడటానికి అలవాటు చేసుకుంటారని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.అందుకే కమర్షియల్ జోనర్ బౌండరీలు దాటకుండా సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.అయితే బాబీ తర్వాత వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నట్లు బోగట్టా.

ఇప్పుడు వారిద్దరు మెగాస్టార్ కోసం కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.ఇప్పటికే వెంకీ కుడుముల చిరంజీవికి కథని కూడా నేరేట్ చేయడం జరిగిందని, దానిపైనే వర్క్ చేస్తున్నాడని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube