సంక్రాంతి 2021 క్లీయర్‌ విన్నర్‌ ఎవరో తేలిపోయింది

సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాలు వస్తాయా లేదా అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేశారు.కరోనా కారణం మరియు 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుదల అయితే రెవిన్యూ జెనరేట్ అవ్వడం కష్టం.

 Sankranti Films Winner Raviteja Krack , After Corona Tollywood , Alludu Adhurs,-TeluguStop.com

అయినా కూడా ధైర్యం చేసి తెలుగు సినిమాలు క్రాక్‌, అల్లుడు అదుర్స్ మరియు రెడ్‌ సినిమాలు వచ్చాయి.ఈ మూడు సినిమాలతో పాటు తమిళ తంబి సూపర్ స్టార్ విజయ్ కూడా తన మాస్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తాయని అంతా అనుకున్నారు.ఇదే సమయంలో కరోనా కారణంగా సినిమాలకు కనీసం వసూళ్లు అయినా వస్తాయా అంటూ అనుమానం ను వ్యక్తం చేశారు.

ఈ నాలుగు సినిమాల్లో క్లీయర్ గా సంక్రాంది విన్నర్‌ క్రాక్‌ అని తెలిపోయింది.

నాలుగు రోజుల ముందుగానే సంక్రాంతి ని అభిమానులకు అందించిన రవితేజ సినిమా తో బ్రేక్‌ ఈవెన్ సాధించాడు.రూ.20 కోట్ల రూపాయలు ఈ సినిమా బిజినెస్ చేసింది.తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందని అంతా ఆశించారు.అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అయినా కూడా బ్రేక్‌ ఈవెన్‌ విషయంలో అనుమానాలు ఉన్నాయి.50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా బ్రేక్ ఈవెన్‌ అయ్యే విషయం పై ఎక్కువ గా నమ్మకం లేదు.కాని అనూహ్యంగా అయిదవ రోజుకు సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించింది.ఇకపై వచ్చేవి అన్ని కూడా లాభాలే.రెండు సినిమాలు అల్లుడు అదుర్స్‌ మరియు రెడ్‌ సినిమాలు నిరాశ మిగిల్చాయి.దాంతో క్రాక్‌ సినిమాకు కనీసం మరో అయిదు నుండి ఏడు కోట్లు అయినా రెవిన్యూ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అంటే ఈ సంక్రాంతికి క్లీయర్ గా క్రాక్‌ విన్నర్‌ అనడంలో ఎలంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube