నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ గా అఖండ అదిరిపోయే హిట్ అందుకుంది.
బాలయ్య ఊర మాస్ హంగామా థియేటర్లని షేక్ చేసింది.విజువల్ ట్రీట్ గా అనిపించిన అఖండ సినిమా ఆన్ సెట్స్ ఎలా కష్టపడ్డారు అన్నది మేకింగ్ వీడియోలో చూపించారు.
సినిమా మొత్తం ఫైట్స్ ఎక్కువగా ఉండటంతో అఖండ మేకింగ్ వీడియో కూడా ఫైట్స్ సీన్స్ ఎక్కువ కనిపించాయి.అంత కష్టపడ్డారు కనుకనే సినిమాకు ఇంతటి ఘన విజయం దక్కిందని అనుకుంటున్నారు.
ఈ కాంబోలో ఇదివరకు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల కన్నా అఖండ అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమా మేకింగ్ వీడియోతో నందమూరి ఫ్యాన్స్ మరింత ఖుషిగా ఉన్నారు.
అఖండ సినిమా సక్సెస్ జోరు మీదున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్నాడు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమా లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించనున్నారు.