'ఆహా' తమన్నా టాక్‌ షో ఇంకా ఎప్పుడు?

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా ప్రాభవం కోల్పోతున్న ఈ సమయంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.ఆహా కోసం తమన్నా 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోందని అందులో భాగంగా మొదటి సీజన్‌ ను 50 ఎపిసోడ్స్‌ చిత్రీకరణ పూర్తి అయ్యిందని వార్తలు వచ్చాయి.

 Latest Update Of Aha Tammana Talk Show, Tamanna, Aha, Suma, Web Series-TeluguStop.com

అదుగో ఇదుగో అంటూ తమన్నా టాక్‌ షో గురించి వాయిదా వేస్తూ వస్తున్నారు.మంచి సమయం అంటూ ఎదురు చూస్తున్న ఆహా వారు తమన్నా అభిమానుల ఓపికను పరీక్షిస్తున్నారు.

ఇప్పటి వరకు తమన్నాను ఎన్నో ఇంటర్వ్యూల్లో చూశాం.అయితే మొదటి ఆసారి ఆమె సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేయబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఆ టాక్‌ షో వైపు చూస్తున్నారు.

ఇదో రెగ్యులర్‌ టాక్‌ షో మాదిరిగా కాకుండా ఒక గేమ్‌ షో లా కూడా ఇది ఉంటుందని ఆహా వర్గాల వారు అంటున్నారు.అందరికి నచ్చే విధంగా ఆహా ఇది డిజైన్‌ చేసిందని ప్రచారం చేశారు.

దాంతో ఎప్పుడెప్పుడు ఈ టాక్‌ షో ను చూస్తామా అంటూ ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు.ఈమద్య కాలంలో ఆహా జోరు కొనసాగుతోంది.కాని తమన్నా షో మాత్రం రావడం లేదు.

ఆహా ప్రారంభం అయ్యి ఏడాది కావస్తున్నా కూడా కంటెంట్‌ ఏది అంటూ జనాలు నిన్న మొన్నటి వరకు విమర్శలు చేశారు.

అయితే ఇప్పుడు వారికి కావాల్సినంత వినోధాని ఆహా ఇస్తోంది.వెబ్‌ సిరీస్‌, సినిమా, సుమ షో ఇలా అన్న విధాలుగా ఆహా బుల్లి తెరపై కుమ్మేస్తోంది.తప్పకుండా ఆహాలో ప్రసారం కాబోతున్న తమన్నా టాక్‌ షో కూడా సెన్షేషనల్‌ అవుతుందని అనుకున్నారు.కాని ఆ షో మాత్రం అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడేస్తూ వస్తున్నారు.

మరి ఈ నెలాఖరు వరకు అయినా ప్రసారం అయ్యేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube