సాధారణంగా ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు( knee pain ) అంటే కేవలం వయస్సు ఎక్కువగా ఉన్న వారిలో మాత్రమే కనిపించేది.అయితే మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా మారిపోయింది.
మారిన జీవనశైలి, ఆహారం వలన వయసు తేడా లేకుండా ఎన్నో వ్యాధులు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి.అలాగే మోకాళ్ల నొప్పులు కూడా కేవలం 40 సంవత్సరాలు ఉన్న వారిలో కూడా కనిపిస్తున్నాయి.
అయితే వీటికి కారణం మారుతున్న జీవనశైలి, ఆహారం( Food) అని చెప్పవచ్చు.చాలామంది మోకాళ్ళ నొప్పులతో వయసు తేడా లేకుండా బాధపడుతూ ఉన్నారు.

అయితే తాను మరింత ఎక్కువగా నడిస్తే మోకాళ్లు అరిగిపోతాయేమోనని, దానివల్ల తమకు నొప్పి మరింత పెరుగుతుందేమోనని వారు అపోహపడుతుంటారు.అయితే నిజానికి మన మోకాళ్ళకు కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.ఆ సమయంలో రక్తప్రసరణ( Circulation ) బాగా జరిగి కీళ్లకు మంచి పోషణాన లభిస్తుంది.అంతేకాకుండా మోకాలు, ఎముకలతో పాటు ఇతర కండరాలు, దేహంలోనీ ఏముకలు బలపడతాయి.
అందుకే ఎక్కువగా నడిస్తే మోకాళ్లు అరిగిపోతాయేమో అన్న అపోహ వదిలేయడం మంచిది.అయితే మోకాళ్ళ నొప్పులను ఎలా నివారించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు కొన్ని పనులు చేయకపోవడం మంచిది.మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ అంతస్తు మెట్లు ఎక్కి దిగడం లాంటివి చేయకూడదు.ఇలా ఎగుడుదిగుడుగా ఉండే నేలపై నడక చేస్తే మోకాళ్ళ నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది.అందుకే వాకింగ్ లోను సమతలంగా ఉండే నెల పైనే నడవాలి.

ఇక అంతేకాకుండా నేలపై కాళ్లు రెండు మడత పెట్టుకుని కూర్చోకూడదు.లేదా కాళ్ళను మడత వేసుకుని లేవకూడదు.అలాగే నేల మీద ఉన్న వస్తువులని, బరువులని నడుము వంచి లేపకూడదు.అలా లేపిన తరుణం మోకాళ్లపై బరువు పడి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఎంత బరువు ఉన్నా కూడా కింద కూర్చొని నెమ్మదిగా లేపాలి.ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తే మోకాళ్ళ నొప్పి నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు.







