మెడికల్ రంగంలో ఎంతో మందికి సేవ చేసి ఉన్నత స్థాయికి చేరాలని అనుకున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.26 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందడం ఆమె స్నేహితులను ఎంతగానో బాధ పెడుతోంది.ప్రీతి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రీతి మరణానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రీతి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.గతేడాది నవంబర్ నెల 18వ తేదీన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులో చేరింది.
థియేట్రికల్ క్లాసులలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ స్టూడెంట్స్ తో కలిసి ఆపరేషన్ థియేటర్ లో ప్రీతి విధులు నిర్వహించగా ఆ సమయంలో సీనియర్ అయిన సైఫ్ నుంచి ప్రీతికి వేధింపులు ఎదురయ్యాయి.
ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్ డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయగా వెంటిలేటర్, ఎక్మోపై ఆమెకు చికిత్స అందించారు.మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు.ప్రీతి ఆడియో వైరల్ కాగా ఆ ఆడియోలో ఆమె సీనియర్లు అంతా ఒకటేనని సైఫ్ తనలా చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిందితుడు విచారణను ఎదుర్కొంటున్నాడు.ప్రీతి మరణానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు మిస్టరీగా ఉన్నాయి.
ప్రీతి శరీరం నీలి రంగులోకి మారిందని తెలుస్తోంది.డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ ఇంజక్షన్ వల్ల హైదరాబాద్ కు వచ్చే సమయానికి ఆమె ఆరోగ్యం క్షీణించిందని కండరాల క్షీణత జరిగిందని డాక్టర్లు వెల్లడించారు.ఇంజక్షన్ వల్లే ఆమె శరీరంలో మార్పులు వచ్చి శరీరం నీలి రంగులోకి మారినట్టు తెలుస్తోంది.ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.