కెనడాలో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా...ఈ భంపర్ ఆఫర్ మీకోసమే...!!

ప్రపంచ దేశాల నుంచీ అత్యధిక శాతం మంది అమెరికాకు వలస వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.అయితే కరోనా తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు అమెరికా తరువాత వలస వాసుల చూపు కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలపై పడుతోంది.

 Want To Settle Permanently In Canada This Bumper Offer Is For You Canada, 10 Lak-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలస వాసులను ఆకర్షించేందుకు తమ దేశంలో సకల సౌకార్యాలు కల్పిస్తూ వలస వాసులకు స్వాగతం చెప్తోంది కెనడా ప్రభుత్వం.కెనడా వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే వారి కోసం భంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది.

తమ దేశంలో మొత్తం 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రతిభకలవారు తమ దేశంలోకి వచ్చేయండంటూ ఆహ్వానం అందిస్తోంది.వివరాలోకి వెళ్తే.

2021 లో సుమారు 3 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరుకుందని తమ దేశంలో కార్మికుల కొరతతో పాట, నిపుణుల కొరత తీవ్రంగా ఉందని కెనడా లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది.కెనడాలో ప్రస్తుతం కార్మికుల రిటైర్మెంట్ వయసు దగ్గర పడిందని, అలాగే కొందరు రిటైర్మెంట్ కంటే ముందుగానే రిటైర్ అవుతున్నారని దాంతో ఖాళీలు 2021 కంటే ఎక్కువగా పెరిగిపోయాయని తెలిపింది.

ఈ కారణాల ద్వారానే కెనడాలో ఇమ్మిగ్రేషన్ కు డిమాండ్ పెరిగిందని, కెనడాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని తెలిపింది.

ఇదిలాఉంటే

Telugu America, Australia, Corona, Canada, Job-Telugu NRI

కెనడాలో ఈ దశాబ్ద కాలంలో సుమారు 85 లక్షల మందికి పైగా వృద్దుల పదవీ విరమణ ఉంటుందని దాంతో రానున్న రోజుల్లో కెనడాలో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు.ప్రస్తుతానికి ఈ ఏడాదికి గాను 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కెనడా సర్కార్ చర్యలు చేపడుతోందని, అలాగే 2024 ఏడాదికి మరో 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube