తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ .ఎక్కడా తనపై విమర్శలు, అసంతృప్తులు రాకుండా చూసుకుంటున్నారు.
ముఖ్యంగా పదవుల విషయంలో ఎవరెవరికి కేటాయించాలనే విషయంలో క్లారిటీ గా ఉంటున్నారు.తాను చేపట్టిన నియామకాల విషయంలో ఎటువంటి విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, ప్రజల్లో సానుకూలత ఉన్నవారికి కీలికమైన పదవులు కట్టబెడుతున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం( Professor Kodandaram ) కు ఎమ్మెల్సీ పదం ఇవ్వడంతో పాటు, మంత్రిని చేయాలనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
జనాల్లో కోదండరాంకు ఉన్న సానుకూలతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదే విషయంపై పార్టీ పెద్దలకు నివేదిక ఇచ్చేరట.వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తరువాత మంత్రిని చేయాలని, ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి .వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి .వాటిలో ఒకటి కోదండరాంకు కేటాయించనున్నారు అనే ప్రచారం జరిగింది.అయితే కోదండరాం కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి , మంత్రిని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఆదనపు బలం చేకూరుతుందని , ఉద్యమకారుల నుంచి , ప్రజల నుంచి సానుకూలత ఏర్పడుతుందని రేవంత్ అంచనా వేశారట .
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం కీలకపాత్ర పోషించడం , పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏ తాటిపైకి తీసుకువచ్చి కీలకంగా వ్యవహరించారు .అయితే కోదండరాం కష్టాన్ని బిఆర్ఎస్ ( Brs )తమకు అనుకూలంగా మార్చుకుని కోదండరాం ను పక్కన పెట్టింది.దీంతో కోదండరాంకు సరైన న్యాయం కాంగ్రెస్ లోనే జరిగిందనే అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వడమే కరెక్ట్ అని రేవంత్ నిర్ణయించుకున్నారట.