కెనడాలోని బ్రాంప్టన్‌లో(Brampton, Canada) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.అశోక్ కుమార్ (Ashok Kumar)అనే 69 ఏళ్ల భారత సంతతి పూజారి, భక్తి ముసుగులో దారుణానికి ఒడిగట్టాడు.
మతపరమైన పూజల పేరుతో ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఈ కామాంధుడు ఆమెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మార్చి 3వ తేదీ సోమవారం రోజున బాధితురాలి ఇంటికి వెళ్లిన అశోక్ కుమార్.పూజలు చేస్తున్న సమయంలోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.అయితే, ఆ మహిళ వెంటనే తేరుకుని జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలియజేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మార్చి 7వ తేదీ శుక్రవారం నాడు నిందితుడు అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
అశోక్ కుమార్ అలియాస్ అశోక్ శర్మపై లైంగిక దాడికి (Ashok Kumar alias Ashok Sharma for sexual assault)పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడు బ్రాంప్టన్‌లో చాలా సంవత్సరాలుగా మత గురువుగా కొనసాగుతున్నాడని పోలీసులు వెల్లడించారు.అయితే, ఈ ఘటన వెలుగులోకి రావడంతో మరిన్ని బాధితులు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.సమాచారం తెలిసిన వారు 905-453-2121 ఎక్స్‌టెన్షన్ 3460 నంబర్‌కు లేదా పీల్ క్రైమ్ స్టాపర్స్ హాట్‌లైన్ 1-800-222-TIPS (8477) కు ఫోన్ చేయవచ్చు లేదా www.peelcrimestoppers.ca వెబ్‌సైట్‌లో సమాచారం అందించవచ్చు.

త్వరలోనే అశోక్ కుమార్‌ను బ్రాంప్టన్‌లోని ఒంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో హాజరుపరచనున్నారు.ఈ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.మత పెద్దగా నమ్మిన వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడటం బ్రాంప్టన్ కమ్యూనిటీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.







