తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ.నటన, నడవడిక సహా అన్ని విషయాల్లోనూ తన సహజత్వం కనిపించేది.
ఆమె కంటే ముందు కూడా పలువురు సహజ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.అప్పట్లో భానుమతి చాలా సహజంగా నటించేది.
ప్రస్తుతం అదే తీరుగా ముందుకు సాగుతుంది సాయి పల్లవి కూడా.తమ చక్కటి హావభావాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు.
కానీ సహజ నటి అనగానే మనకు కేవలం జయసుధ మాత్రమే గుర్తుకువస్తుంది .తను నిన్ననే తన పుట్టిన రోజును జరుపుకుంది.ఈమె అసలు పేరు సుజాత.1959 డిసెంబర్ 17న జన్మించింది.మద్రాసులోనే పుట్టి పెరిగింది.కానీ వీరిది తెలుగు కుటుంబం.
జయసుధ విజయ నిర్మల ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.విజయ నిర్మల జయసుధకు మేనత్త అవుతుంది.
ఆమె సాయంతో 1972లో వచ్చిన పండంటి కాపురం సినిమాలో తొలిసారిగా నటించింది జయసుధ.ఆ తర్వాత తనకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఆమె సుమారు 300 సినిమాల్లో నటించింది.వాటిలో 20 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి.8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు కూడా చేసింది.జయసుధకు, రాఘవేంద్ర రావుకు మంచి అనుబంధం ఉండేది.వీరిద్దరి కాంబోలో సుమారు 25 సినిమాలు వచ్చాయి.దాసరితోనూ జయసుధకు మంచి సాన్నిహిత్యం ఉండేది.వీరిద్దరు కలిసి 27 సినిమాలు చేశారు.ఒకానొక సమయంలో ఈ ఇద్దరు దర్శకులు తమ సినిమా నటించేందుకు జయసుధ కోసం పోటీ పడిన సందర్భాలున్నాయియి.
ఇక జయసుధ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే. తను 1985లో ప్రేమ వివాహం చేసుకుంది.నితిన్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
పెద్దబ్బాయి నిహార్.రెండో అబ్బాయి శ్రేయంత్.
అతడి కొడుకు కూడా సినిమాల్లోకి వచ్చాడు.అటు 2009 ఎన్నాకల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ గెలిచారు.
ప్రస్తుతం మళ్లీ సెకెండ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది.సినిమాల్లో బాగా బిజీ అయ్యింది.