2024, సెప్టెంబర్‌లో కాలిఫోర్నియా( California ) గగనతలంలో ఓ వింత సంఘటన జరిగింది.అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్( US Air Force Pilot ) ఒకరు తాను UFO (గుర్తు తెలియని ఎగిరే వస్తువు)ని చూసినట్టు రిపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
న్యూస్ నేషన్ ఛానెల్ బాన్‌ఫీల్డ్ ద్వారా లీక్ అయిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 17వ తేదీ, మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో “ట్రాయ్ 21” అనే పైలట్ బీచ్‌క్రాఫ్ట్ 350 విమానంలో కాలిఫోర్నియా గగనతలంలో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.ఉన్నట్టుండి తన కుడి వైపు రెక్క కింద నుంచి ఒక వింత వస్తువు దూసుకుపోవడాన్ని ఆయన గమనించారు.ఆ వస్తువు చూడటానికి ఫుట్‌బాల్ పరిమాణంలో, నల్లగా, స్థూపాకారంలో ఉందని ఆయన తెలిపారు.ఒక్క క్షణం షాక్ తిన్న పైలట్ వెంటనే లాస్ ఏంజిల్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు( ATC ) సమాచారం ఇచ్చారు.“ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు.కానీ ఇప్పుడే నా విమానం రెక్క కింద నుంచి ఏదో ఒక వస్తువు వెళ్లిపోయింది.బహుశా ఫుట్‌బాల్ సైజులో ఉండి ఉంటుంది” అని పైలట్ ATCతో అన్నారు.

ఆ వింత వస్తువు కళ్లముందు నుంచి కనుమరుగవడంతో ట్రాయ్ 21 వెంటనే దాన్ని వెతకడానికి ప్రయత్నించారు.విమానంలోని సెన్సార్ ఆపరేటర్ కూడా ఆబ్జెక్ట్‌ను కెమెరాల్లో ట్రాక్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.సరిగ్గా 40 సెకన్ల తర్వాత, విమానం రాడార్ దాదాపు 60 మైళ్ల దూరంలో మరో వస్తువును గుర్తించింది.ఈ బీచ్‌క్రాఫ్ట్ 350 విమానంలో అత్యాధునిక రాడార్ వ్యవస్థ ఉంది.
సాధారణంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌ను ట్రాక్ చేయడానికి ఈ రాడార్‌ను ఉపయోగిస్తారు.అయితే, రాడార్‌లో కనిపించిన వస్తువు, పైలట్ చూసిన వస్తువేనా అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

ఒకవేళ రాడార్‌లో కనిపించిన వస్తువు అదే అయితే, అది కేవలం రెండు నిమిషాల్లోనే మాక్ 2 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి ఉండాలి.డ్రోన్ లాంటి చిన్న వస్తువు అంత వేగంగా వెళ్లడం దాదాపు అసాధ్యం.ఆ సమయంలో విమానం 20,000 అడుగుల ఎత్తులో ఉంది.ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన డ్రగ్స్ నిరోధక మిషన్‌లో భాగంగా ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ ఘటనపై నేషనల్ UFO రిపోర్టింగ్ సెంటర్‌కు రిపోర్ట్ చేశారు.ఆ తర్వాత ATC సిబ్బంది పైలట్‌కు ధైర్యం చెబుతూ, “ఇక్కడ UFO రిపోర్ట్ అయింది నిజమే, కానీ దాని గురించి మేం చూసుకున్నాం.
మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన పనిలేదు” అని అన్నారు.
మరోవైపు టర్కీలోని గాజియాంటెప్ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
కారణం, UFO కలకలం.రాత్రి 10 గంటల ప్రాంతంలో కొంతమంది పైలట్లు కంట్రోల్ టవర్‌కు ఫోన్ చేసి 10,000 అడుగుల ఎత్తులో గుర్తు తెలియని వస్తువు కనిపించిందని రిపోర్ట్ చేశారు.
దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు.అయితే, విమానాశ్రయం రాడార్‌లో మాత్రం అలాంటి వస్తువు ఏదీ కనిపించలేదు.
చివరికి అధికారులు అది బహుశా అనుమతి లేని డ్రోన్ అయి ఉంటుందని తేల్చారు.అయినా, ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని గంటపాటు మూసివేసి, ఆ తర్వాత మళ్లీ సాధారణ కార్యకలాపాలు ప్రారంభించారు.







