పాకిస్తాన్‌కు( Pakistan ) చెందిన ఓ పెళ్లికొడుకు తన కాబోయే భార్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.బాలీవుడ్ స్టైల్లో డ్యాన్స్( Bollywood Dance ) చేసి వధువును ఆశ్చర్యపరిచాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) కావడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఇది కదా అసలైన రొమాన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
డిజిటల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మహమ్మద్ ఘఫార్ ఫరూఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్ దాటేసింది.
నెటిజన్లు ఈ వీడియో చూసి “సినిమాటిక్ లవ్ స్టోరీ”( Cinematic Love Story ) అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.
వీడియోలో వధువు అటికా అలీ ఖవాజా తన బాల్కనీలో నిలబడి ఉంది.
తన ప్రియుడు ఖవాజా అలీ అమీర్ తన స్నేహితుల గ్యాంగ్‌తో సందడి చేస్తూ రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది.ఖవాజా అలీ అమీర్ తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ‘సాజన్ జీ ఘర్ ఆయే’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు.

ట్రెడిషనల్ డ్రెస్‌లో ఉన్న అమీర్ వీధి మధ్యలో ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేస్తుంటే, అతడి స్నేహితులు కూడా అతనికి జత కలిశారు.దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.బాల్కనీలో నిలబడి ఉన్న అటికా ఈ డ్యాన్స్ చూస్తూ ఎంతో సంతోషించింది.చప్పట్లు కొడుతూ, కేరింతలు పెడుతూ తన ప్రియుడిని ఎంకరేజ్ చేసింది.ఆ తర్వాత వెంటనే కిందికి వచ్చి తన ప్రియుడితో కలిసి స్టెప్పులేసింది.ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని మరింత సందడి చేశారు.
ఈ లవ్లీ మూమెంట్ అందరి హృదయాలను దోచుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఈ జంటపై ప్రేమను కురిపిస్తున్నారు.వారి స్వచ్ఛమైన ప్రేమకు ముగ్ధులవుతున్నారు.ఒక యూజర్ కామెంట్ చేస్తూ.“ఇలాంటి రొమాన్స్ కోసమే కదా మేం కలలు కనేది.బాలీవుడ్ ప్రేమ కథలను నిజం చేసింది” అని రాసుకొచ్చారు.

మరో యూజర్.“నిజమైన ప్రేమంటే ఇదే.ఇలాంటి ప్రేమ కథలు చూస్తే మళ్లీ ఫెయిరీ టేల్స్‌ను నమ్మాలనిపిస్తుంది” అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టారు.“గ్రాండ్ వెడ్డింగ్ హడావిడిలో ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ మూమెంట్ చూడటం చాలా రిలీఫ్‌గా ఉంది” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇంకొందరైతే ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు.“ఇలా ఉండాలి ఎంట్రీ అంటే.షారుఖ్ ఖాన్ కూడా గర్వపడతాడు” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే.“ఫ్యూచర్ హస్బెండ్స్ నోట్ చేసుకోండి.ఇదిగోండి కొత్త స్టాండర్డ్స్” అంటూ మరొక యూజర్ ఫన్నీ కామెంట్ పెట్టారు.
ఏది ఏమైనా ఈ కపుల్స్ స్పాంటేనియస్ సెలెబ్రేషన్ మాత్రం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.ప్రేమకు గ్రాండ్ గెస్చర్స్ అవసరం లేదు, స్వచ్ఛమైన ఎమోషన్ ఉంటే చాలు అని ఈ వీడియో చూస్తే ఎవరైనా అంటారు.







