సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం చింతిర్యాల వద్ద కృష్ణానదిలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బల్లకట్టు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మార్చి 31-2022 తేదీ నాటికి బల్లకట్టు నిర్వహణ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా బల్లకట్టు నడుపుతుండటంతో ఎంపీడీఓ గ్యామ నాయక్ శుక్రవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఎంపిడిఓ ఫిర్యాదు మేరకు బల్లకట్టు నిర్వహిస్తున్న షేక్ పప్పుజాన్,ములగుండ్ల సైదిరెడ్డి, చీమలమర్రి గోవిందరెడ్డి,షేక్ దాదా బుడే అనే నలుగురు నిర్వాహకులపై కేసు నమోదు అయినట్లు ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.