హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తన కస్టమర్లకోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.కేవలం రూ.59 చెల్లించి 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది.అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి.అన్ని రోజుల్లో ఈ ఆఫర్ వర్తించదు.కేవలం నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే ప్రయాణికులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చునని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది.‘సూపర్ సేవర్ కార్డు’ పేరుతో ఆఫర్ నేటినుండి అనగా ఏప్రిల్ 2 నుంచి వర్తిస్తుందని L&T మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు.
ఇక ఈ సూపర్ సేవర్ కార్డును ఈ గురువారం ప్రారంభించగా, తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని మెట్రో రైలు ఆఫర్ అమలులోకి రానుందని సమాచారం.మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
ప్రతి నెలలో ఆదివారం, 2 – 4వ శనివారాలను సెలవు రోజులుగా పేర్కొంది.రెగ్యూలర్ సెలవుదినాలతో పాటుగా పండుగ రోజులైన ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో రూ.59 మెట్రో ఆఫర్ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ సెలవు రోజులను మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు.
లేదా T సవారీ యాప్ లేదా హైదరాబాద్ మెట్రో వెబ్ సైట్లో సెలవురోజుల వివరాలు ప్రయాణికులు పొందవచ్చు.‘సూపర్ సేవర్ కార్డు’ను కేవలం కొనుగోలుదారుడు మాత్రమే వినియోగించుకోవాలి.
ఈ కార్డును ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయకూడదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.