ఈ రోజుల్లో చాలా మంది మారుతున్న పరిస్థితులు, బిజీ జీవనశైలి కారణంగా బెల్లీ ఫాట్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ పొట్ట కారణంగా చిన్న పని చేసినా, కొంత దూరం నడిచిన ఇట్టే ఆయాసం వచ్చేస్తుంది.
అలాగే ఎక్కువ పని చేయలేకపోవటం,గుండె దడ వంటివి కూడా ఉంటాయి.ఇలా శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ కొవ్వును ఎలా తగ్గించుకోవాలా అనే విషయం గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక చిట్కా గురించి చెప్పబోతున్నాం.
ఈ చిట్కా ను చాలా సులభంగా ఫాలో అవ్వవచ్చు.అలాగే చాలా సమర్ధవంతముగా పనిచేస్తుంది.
ఈ చిట్కాను అనుసరిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గటమే కాకుండా శరీరం ఆరోగ్యంగా,ఫిట్ గా ఉంటుంది.ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కరిగించే ఎఫెక్టివ్ చిట్కా గురించి తెలుసుకుందాం.
ఈ స్లిమింగ్ పొడి మీరు ఎక్కువగా కష్టపడకుండా శరీరంలో కొవ్వును కరిగిస్తుంది.ఈ స్లిమింగ్ పొడిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ పొడికి అవసరమైన పదార్ధాలు జీలకర్ర,నువ్వులు,దాల్చిన చెక్క,కలోంజీ సీడ్స్.కలోంజీ సీడ్స్ అంటే బ్లాక్ సీడ్స్.ఇవి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి.ఈ నాలుగు పదార్ధాలు శరీరంలో కొవ్వును కరిగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
అలాగే శరీర ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరులో కూడా సహాయపడతాయి.
ఈ నాలుగు పదార్ధాలను సమాన పరిమాణంలో తీసుకోని విడివిడిగా వేగించాలి.
దోరగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.ఈ పొడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.
అర టీ స్పూన్ పొడిలో తేనే కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే క్రమంగా శరీరంలో కొవ్వు కరిగి మీ శరీరానికి మంచి షేప్ వస్తుంది.