ఈ రోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ ప్రాంతంలో ఉన్న మైదానంలో జిల్లా పోలీస్ అధికారులు రెండు టీమ్ ల గా ఏర్పడగా రెండు టీమ్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది.ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఇరు జట్లకు జిల్లా ఎస్పీ ,సిరిసిల్ల డిఎస్పీ నాయకత్వం వహించగా మొదటగా బ్యాటింగ్ చేసిన సిరిసిల్ల డిఎస్పీ టీం 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్స్ ను కోల్పోయి 102 పరుగులు చేయడంతో సిరిసిల్ల డిఎస్పీ టీం విజయం సాధించింది.ఈ క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లభించడం జరిగింది.
బెస్ట్ బ్యాట్స్ మెన్,బెస్ట్ బౌలర్ అవార్డ్ వేములవాడ ట్రాఫిక్ ఎస్.ఐ రాజు కి లభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు.క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని, మన యొక్క ఫిట్ నెస్ పైన ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సి.ఐ లు కృష్ణ,శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, sb సి.ఐ శ్రీనివాస్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పాల్గొన్నారు.