ఆ సింగర్స్ వాయిస్ కి దేవీశ్రీ ఫిదా ...!

ఇన్నాళ్లు సింగింగ్‌ షో లు కేవలం బుల్లి తెర పై మాత్రమే ప్రసారమయ్యేవి.ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ, జీ తెలుగు ఛానళ్లలో మాత్రమే సింగింగ్ కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి.

 Devi Sri Prasad Fida For That Singers Voice , Singers, Dsp, Devi Sri Prasad, Fidda, Vagdevi, Srinivas, Singer Vagdevi , Srinivas Darimishetti-TeluguStop.com

కానీ మొదటి సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు సింగింగ్ షో డిజిటల్ వేదిక ద్వారా వచ్చింది.ఆహాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో రోజుకీ రోజుకీ దూసుకుపోతుంది.

కొత్త కొత్త వాయిస్ లను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షోకు అనూహ్య స్పందన లభిస్తోంది.ఈ షోకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 Devi Sri Prasad Fida For That Singers Voice , Singers, Dsp, Devi Sri Prasad, Fidda, Vagdevi, Srinivas, Singer Vagdevi , Srinivas Darimishetti-ఆ సింగర్స్ వాయిస్ కి దేవీశ్రీ ఫిదా #8230;-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సైతం తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ పాడిన పాటలు విని మంత్రముగ్దులైయ్యారు. సింగర్ వాగ్దేవి.

శ్రీనివాస్ దరిమిశెట్టిలు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటను అద్భుతంగా ఆలపించారు.వీరి పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.

అది కాస్త దేవి శ్రీ ప్రసాద్ దగ్గరకు చేరింది.

వాగ్దేవి, శ్రీనివాస్ పాట పాడిన తీరుకు దేవీ శ్రీ ప్రసాద్ ముగ్దులయ్యారు.

ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు.దేవి శ్రీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమ పాటను మెచ్చుకోవడంతో వాగ్దేవి, శ్రీనివాస్ ఆనందం వ్యక్తంచేశారు.

గతంలో కూడా వీరి పాటలను మెచ్చుకుంటూ సినిమాలో పాడే అవకాశాలు వస్తాయంటూ తమన్ అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

రష్మిక జంటగా నటించిన పుష్ప చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.

ఇందులోని పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.ఇప్పటికీ పుష్ప పాటలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube