రెండు అభిశంసనలు...ట్రంప్ కి ఇది ఘోరమైన అవమానం..!!!

ట్రంప్ పై అమెరికన్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం కాకరేపుతోంది.తాజాగా ట్రంప్ పై మొత్తం రెండు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు.

 Trump White House Domocratic-TeluguStop.com

ఉక్రెయిన్ గేట్ కుంభకోణంలో తన అధికార దుర్వినియోగం అమెరికన్ కాంగ్రెస్ ని అడ్డుకున్నారు అనే కోణంలో ఈ రెండు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు ప్రతినిధుల సభలో తీర్మానం పెడుతున్నట్లుగా డెమోక్రాట్లు ప్రకటించారు.

ఈ విషయంపై దిగువ సభలో చర్చ జరగనుంది.అయితే

Telugu Telugu Nri Ups, Trumpwhite-

అమెరికా చరిత్రలో ఇలాంటి ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్ సృష్టించాడు.రిపబ్లికన్ పార్టీ కి చెందిన ట్రంప్ తన ప్రత్యర్ధి జో బిడెన్ ని వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టడానికి విదేశీ శక్తులతో కలిసి కుట్ర జరిపారని తేలిందనిజ్యూడిషరి కమిటీ చైర్మెన్ జెర్రీ నాడర్ ఆరోపించారు.తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు.

అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి హేయమైన , నీచమైన పనులకి పూనుకున్నారు కాబట్టి అతనిపై అభిశంసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని అందుకే అమెరికన్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని న్యాయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ జెర్రీ నాడ్లార్ తెలిపారు.మొత్తంగా చూస్తే అధ్యక్ష ఎన్నికల్లోగా ట్రంప్ పై ఈ నేరాలు రుజువులు చూపించి వచ్చే ఎన్నికల్లో ట్రంప్ ఘోరమైన ఓటమి పాలు అయ్యేలా చేయాలని డెమోక్రాట్లు మాంచి పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube