తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పవచ్చు.
బీజేపీ టీఆర్ఎస్ పై రకరకాల ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తూ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే తెలంగాణ రాజకీయం రంజుగా మారడంతో ఇక రానున్న రోజుల్లో రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు ఇటువంటి క్లిష్ట రాజకీయ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
అయితే ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా రాజకీయ వాతావరణం నెలకొన్న తరుణంలో రానున్న రోజుల్లో ఎలా రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందనేది ఇప్పుడే మనం స్పష్టం చేయలేకపోయినా రానున్న రోజుల్లో మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా బీజేపీ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ గా రాజకీయ వేడి నెలకొంటుందని అందరూ భావించినా కానీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు నిరసన హోరు పెంచుతున్న తరుణంలో త్రిమఖ పోటీ నెలకొనే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
అయితే బీజేపీ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది.
మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తాయనేది చూడాల్సి ఉంది.







