శంకర్/రాజమౌళి..వీరిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు ?

ఒక సినిమా హిట్ కావాలంటే దాంట్లో దర్శకుడి పాత్ర చాలా వరకు ఉంటుంది అలా సినిమాలు తీసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్లి అది హిట్ అయిన ఫ్లాప్ అయిన దాంట్లో దర్శకుడి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే చాలా రోజుల నుంచి సౌత్ ఇండియాలో ఉన్న దర్శకులు అందరిలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అనే దానిమీద చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

 Who Is The Number One Director In South India, Rajamouli, Shanker, Driectors, To-TeluguStop.com

సౌత్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ నెంబర్ వన్ కోసం పోటీ పడే దర్శకులు మాత్రం ఇద్దరే ఉన్నారు వాళ్లలో ఒకరు శంకర్ కాగా, ఇంకొకరు రాజమౌళి.ఇప్పటివరకు ఈ ఇద్దరి సినిమాలు సౌత్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేశాయి, ఒకసారి ఇద్దరు తీసిన సినిమాలను పరిశీలించి చూద్దాం.

రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తెలుగు చలన చిత్ర సీమకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆ సినిమా మంచి విజయం సాధించింది అలాగే రాజమౌళికి దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.

శంకర్ మొదటి సినిమా జెంటిల్ మెన్ అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.

రెండో సినిమాగా రాజమౌళి ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేయగా, ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.శంకర్ రెండో సినిమా ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ తో ప్రేమికుడు అనే ఒక లవ్ స్టోరీని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Telugu Bahubali, Driectors, Jeans, Rajamouli, Robo, Shankar, Tollywood-Telugu St

రాజమౌళి మూడో సినిమా నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన సై సినిమా కాగా, అది యావరేజ్ గా నిలిచింది.శంకర్ మూడో సినిమా కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన నాలుగో సినిమా చత్రపతి.అది సూపర్ హిట్ సాధించి అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలాగే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన నాలుగో సినిమా జీన్స్.ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ హీరో,హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత రాజమౌళి విక్రమార్కుడు,యమదొంగ, మగధీర లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

అలాగే శంకర్ కూడా ఒకే ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు, తర్వాత వచ్చిన బాయ్స్ సినిమా తో మొదటి ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు సినిమాతో సౌత్ ఇండియా వైస్ మంచి గుర్తింపు సాధించాడు.తెలుగులో కూడా ఈ సినిమా తెలుగు సినిమాలకు గట్టిపోటీ ఇస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత రాజమౌళి మర్యాద రామన్న లాంటి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.తర్వాత వచ్చిన ఈగ బాహుబలి పార్ట్ వన్ లాంటి సినిమాలతో నార్త్ లో కూడా తన హవాని కొనసాగించాడు.

శంకర్ రజనీకాంత్ తీసిన రోబో సినిమా తో ఇండియా వైస్ దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించాడు.

బాహుబలి2 తో రాజమౌళి ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం రాజమౌళి త్రిబుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Telugu Bahubali, Driectors, Jeans, Rajamouli, Robo, Shankar, Tollywood-Telugu St

స్నేహితుడు, ఐ లాంటి సినిమాలు శంకర్ కెరీర్లో ఫ్లాప్ గా నిలిచాయి.తర్వాత వచ్చిన రోబో 2.0 తో దర్శకుడిగా మళ్లీ తన పేరుని ఇండియా వైస్ మారుమ్రోగిపోయేలా చేశాడు.ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు.

ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ అంటే చెప్పడం కొంచెం కష్టమే ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి శంకర్ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో అయితే రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది.

శంకర్ కూడా ఒక ఫంక్షన్ లో రాజమౌళి గురించి చెబుతూ తను స్వతహాగా రాజమౌళి ఫ్యాన్ అని చెప్పాడు.

ఇప్పటివరకైతే ఎవరు నెంబర్ వన్ అనేది కచ్చితంగా చెప్పలేం కానీ ఫ్యూచర్ లో వాళ్ళు చేసే ప్రాజెక్టుల హిట్స్ ని బట్టి నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube