ఆ భయంతోనే.. కే‌సి‌ఆర్ సైలెన్స్ !

బి‌ఆర్‌ఎస్ ( BRS )ను దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( Telangana Chief Minister KCR ) పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా పార్టీని బలపరచాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.టి‌ఆర్‌ఎస్ బి‌ఆర్‌ఎస్ గా మారిన మొదట్లో ఏపీపైనే కే‌సి‌ఆర్ ఎక్కువ దృష్టి సారించారు.

 With That Fear Kcr Silence Details, Ap Cm Jaganmohan Reddy,brs ,telangana Chief-TeluguStop.com

ఏపీ బి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలను( AP BRS Party Activities ) వేగవంతం చేయడం, యాక్టివ్ గా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టడం వంటివి చేస్తూ ఆ మద్య నానా హడావిడి చేశారు.అయితే ఏమైందో తెలియదు గాని గత కొన్ని రోజులుగా ఏపీ విషయంలో కే‌సి‌ఆర్ సాలెంట్ వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ పార్టీ కార్యాలయ ఏర్పాటు సమయంలో కూడా అందుబాటులో లేరు.

Telugu Ap Brs, Apcm, Chandrababu, Kcr Brs Ap, Telangana Kcr, Visakha Steel-Polit

ఆ మద్య విశాఖా ఉక్కు ప్లాన్ విషయంలో కొంత హడావిడి చేసినప్పటికీ మళ్ళీ సైలెంట్ అయ్యారు.అయితే ఏపీ విషయంలో కే‌సి‌ఆర్ మౌనం వహించడానికి కారణం ఉందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.కే‌సి‌ఆర్ కు మరియు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి( AP CM Jaganmohan Reddy ) మద్య మంచి సన్నిహిత సంబంధం ఉంది.

వచ్చే ఎనికల్లో రెండు పార్టీలు పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో కలిసే అవకాశం ఉందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.దీంతో ఏపీలోని కే‌సి‌ఆర్ ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది.

ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసమే కే‌సి‌ఆర్ ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Ap Brs, Apcm, Chandrababu, Kcr Brs Ap, Telangana Kcr, Visakha Steel-Polit

అందువల్ల ప్రస్తుతం ఏపీలో కే‌సి‌ఆర్ యాక్టివ్ అయితే వైసీపీకి రావాల్సిన కాపు ఓటు బ్యాంకు డివైడ్ అయ్యి చంద్రబాబుకు ప్లెస్ అవుతుంది.అందుకే కే‌సి‌ఆర్ ప్రస్తుతం ఏపీ విషయంలో సైలెన్స్ వ్యవహరిస్తున్నారనేది కొందరి వాదన.కాగా మరికొందరు చెబుతున్నా మాటేమిటంటే.

ఏపీలో మెజారిటీ ప్రజల నుంచి కే‌సి‌ఆర్ పై వ్యతిరేకత వినిపిస్తోందట.దీనికి కారణం గతంలో ఏపీ ప్రజలపై కే‌సి‌ఆర్ చేసిన దురుసు వ్యాఖ్యాలే.

అందుకే కే‌సి‌ఆర్ పై ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలు ఆగ్రహంగానే ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయట.అందుకే ఏపీలో ఏమాత్రం యాక్టివ్ అయిన కే‌సి‌ఆర్ పై నెగిటివ్ ఇంపాక్స్ పడే అవకాశం ఉంది.

అది తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.అందుకే తెలంగాణ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా సైలెన్స్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube