టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరో మినిమమ్ రెండు మూడు భారీ ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఉన్నారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అందరి టైం వృధా అయ్యింది.
దీంతో కరోనా తగ్గగానే ఇప్పుడు అందరు దొరికినన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుంటున్నారు.అయితే సినిమాలను అయితే లైనప్ చేసుకుంటున్నారు కానీ వారు అనుకున్న విధంగా రిలీజ్ చేయలేక పోతున్నారు.
ఏదో ఒక కారణంతో లేట్ అవుతూనే ఉన్నాయి.ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఈయన లైనప్ చేసినన్ని సినిమాలు మరే హీరో కూడా చేయలేక పోతున్నారు.ఈ ఏడాదిలో రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ తో వస్తాడు అనుకుంటే అనూహ్యంగా జూన్ కు వాయిదా పడింది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మూడు సినిమాలు చేతిలో ఉంచుకున్నాడు.క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది.ఇది ఎప్పుడు రిలీజ్ కూడా అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా కొన్నాళ్ళు ఆ తర్వాత పవన్ రాజకీయాల కారణంగా షూట్ ఆగిపోయింది.దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది.
ఇక మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ కొత్త సినిమా షూట్ స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసారు.
కానీ కొన్ని కారణాల వల్ల రెండో షెడ్యూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది.

ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ విజయం తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.ఇది సగానికి పైగానే షూట్ పూర్తి చేసారు.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అలాగే ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అయితే ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా ఈయన ఇంకా ఈ సినిమా స్టార్ట్ చేయలేదు.దీంతో ఈయన ఇప్పట్లో వెండితెర మీద కనిపించడం అసాధ్యమే.
పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకుని అఖండమైన విజయం సొంతం చేసుకున్నాడు.అయితే ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయినా పార్ట్ 2 ఇంకా స్టార్ట్ కాలేదు.త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
దీంతో ఈ సినిమా కూడా ఇప్పట్లో రిలీజ్ అవ్వలేదు.ఇలా స్తర్త్స్ అంతా ఇప్పట్లో థియేటర్స్ లో కనిపించే అవకాశమే లేదు.







